Begin typing your search above and press return to search.
కరోనా సోకిన తల్లి, శిశువు పట్ల నిర్లక్ష్యంపై నిరసనలు..ఆ దేశ ప్రధాని రాజీనామా!
By: Tupaki Desk | 22 Jan 2021 6:00 AM GMTకరోనా కట్టడిలో విఫలమైన ఓ ప్రధాన మంత్రి.. అందుకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశాడు. ఇది ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. మంగోలియా ప్రధాని ఖురేల్ సుఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రపంచ దేశాలన్నీ కారణాలతో విలవిలలాడుతున్న సమయంలో వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొని మంచి పేరు తెచ్చుకున్న యువ ప్రధాని కరోనా సోకిన బాలింత, నవజాత శిశువుకు పునరావాసం కల్పించడంలో మంగోలియా ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తడంతో ఖురేల్ సుఖ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా చికిత్స కేంద్రం లో బిడ్డకు జన్మనిచ్చిన బాలింత, నవజాత శిశువు మైనస్ 25 డిగ్రీల వాతావరణంలో ఎటువంటి సంరక్షణ లేకుండా గడపాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహ జ్వాలలు పడ్డాయి.
కోవిడ్ బాధితురాలు ఆమె నవజాత శిశువుకు అవసరం కల్పించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వచ్చాయి. ఈ విషయమై మంగోలియా రాజధాని ఉలాన్ బాతార్ లో జనం తీవ్రస్థాయిలో ఆందోళన నిర్వహించారు. నిరసన కార్యక్రమాలతో ఆ నగరం దద్దరిల్లిపోయింది. ప్రభుత్వం దిగివచ్చి కరోనా బాధితురాలికి క్షమాపణలు చెప్పింది. అయినా ప్రజలు శాంతించలేదు. దీంతో ప్రధాని జరిగిన తప్పు కు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు.
కరోనా నియంత్రణకు జాతీయ అత్యవసర కమిషన్ చీఫ్ గా పనిచేస్తున్న ఉప ప్రధాని కూడా ఎందుకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. 'కరోనా బాధితురాలైన ఆ తల్లికి, బిడ్డకు పునరావాసం కల్పించడంలో విఫలం చెందాం. ఆమె పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు నా హృదయం ముక్కలైంది. ప్రధానిగా ఘటనకు నేను బాధ్యత వహించాలి.' అని ఖురేల్ సుఖ్ వ్యాఖ్యానించారు.