Begin typing your search above and press return to search.

యాదాద్రికి కాసుల వర్షం.. రికార్డులన్నీ బ్రేక్

By:  Tupaki Desk   |   21 Nov 2022 5:49 AM GMT
యాదాద్రికి కాసుల వర్షం.. రికార్డులన్నీ బ్రేక్
X
తిరుమల వెంకన్న మాదిరే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి భక్తుల రాక మొదలైంది. పోటెత్తుతున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాన్ని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. దీంతో యాదాద్రీశుడికి కాసుల వర్షం కురుస్తోంది.

కార్తీక మాసం చివరి వారం.. ఆదివారం కావడంతో యాదాద్రికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులతో నిండిపోయింది. స్వామి వారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్త జనులు అధికసంఖ్యలో తరలివచ్చారు. శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండ మొత్తం భక్తులతో కిటకిటలాడిపోయింది.

శివాలయం, కార్తీక దీపారాధన, వ్రత మండపాలతోపాటు కొండ మొత్తం భక్తులతో కిటకిటలాడిపోయింది. దీంతో స్వామి వారి దర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పట్టింది.భక్తులు పోటెత్తడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి ఆదాయం కూడా అంతేస్తాయిలో వచ్చింది.

ఆదివారం ఒక్కరోజే వివిధ రూపాల్లో వచ్చిన మొత్తం కలిపి 1.16 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. పోయిన ఆదివారం కూడా కోటి 9 లక్షల 82వేల 446 ఆదాయం సమకూరింది. ఆలయం పునర్నిర్మాణం తర్వాత యాదాద్రీశునికి ఆదాయం బాగా పెరిగింది.

భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తడంతో అంతేస్థాయిలో ట్రాఫిక్ జామ్ కూడా అయ్యింది. రోజంతా దర్శనాలు, స్వామి వారి సేవలో నిమగ్నమైన భక్తులు, సాయంత్రం పూట ఒక్కసారిగా తిరుగు ప్రయాణం కావడంతో వరంగల్-హైదరాబాద్ మార్గంలో గూడురు టోక్ ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

యాదాద్రికి వెళ్లిన వాహనాలకు తోడు వరంగల్ నుంచి హైదరాబాద్ కు వచ్చే వాహనాలు కూడా తోడవడంతో టోల్ ప్లాజా దగ్గర అరకిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. టోల్ ప్లాజా మేనేజర్ సుధీర్ తన సిబ్బందితో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి రద్దీని నియంత్రించేందుకు ప్రయత్నించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.