Begin typing your search above and press return to search.

వైరల్ వీడియోః సూపర్ మ్యాన్ స్టంట్ చేయ‌బోయిన న‌టుడు.. బ‌స్సు వ‌చ్చి..

By:  Tupaki Desk   |   4 Jun 2021 11:08 AM GMT
వైరల్ వీడియోః సూపర్ మ్యాన్ స్టంట్ చేయ‌బోయిన న‌టుడు.. బ‌స్సు వ‌చ్చి..
X
అవ‌కాశం ఉంటే.. ప్ర‌తి ఒక్క‌రూ సూప‌ర్ మ్యాన్ కావాల‌ని కోరుకుంటార‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు. అవును మ‌రి.. సాధార‌ణ మ‌నుషులు చేయ‌లేని ప‌నులను కూడా సూప‌ర్ మ్యాన్ అల‌వోక‌గా చేస్తుంటాడు. అందుకే.. సినిమాల‌కు ప‌రిమిత‌మైన సూప‌ర్ మ్యాన్ ప‌వ‌ర్‌.. త‌మ‌కు రియ‌ల్ లైఫ్ లో వ‌స్తే బాగుండున‌ని ఆశించే వాళ్ల‌కు లెక్కే లేదు.

అయితే.. ఓ న‌టుడు రియ‌ల్ లైఫ్ లో సూప‌ర్ మ్యాన్ స్టంట్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. ఈ మేర‌కు వీడియో షూట్ కూడా సిద్ధం చేశారు. అయితే.. స్టంట్ అనుకున్న విధంగా రాక‌పోగా.. వెనక నుంచి వ‌చ్చిన బ‌స్సు ఢీకొట్టింది. దీంతో తీవ్ర గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది.

బ్రెజిల్ కు చెందిన హాస్య‌న‌టుడు లూయిజ్ రిబీరో డి గ్రాండ్ ఈ విన్యాసానికి సిద్ధ‌మ‌య్యాడు. సూప‌ర్ మ్యాన్ త‌ర‌హాలో డ్ర‌స్ ధ‌రించిన గ్రాండే.. వెన‌క నుంచి వ‌చ్చే బ‌స్సును ఒకే చేత్తో ఆపిన‌ట్టుగా స్టంట్ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే.. సిగ్న‌ల్ ఇవ్వ‌డంలో తేడా వ‌చ్చిందో ఏమోగానీ.. గ్రాండ్ కెమెరావైపు తిరిగి మాట్లాడుతుండ‌గానే వెన‌క నుంచి వ‌చ్చిన బ‌స్సు అత‌న్ని త‌గిలింది.

దీంతో.. గ్రాండే కింద‌ప‌డిపోయాడు. వీడియో ఫుటేజీ కూడా మొత్తం షేక్ అయిపోయింది. ‘‘ఇప్పుడు నేను ఉక్కుతో త‌యారయ్యాను’’ అని చెబుతుండగా.. ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే.. అతనికి పెద్దగా ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. నెటిజ‌న్లు గ్రాండేను తెగ ట్రోల్ చేస్తున్నారు.