Begin typing your search above and press return to search.

బిడ్డ‌కు పాలిచ్చింది.. చ‌చ్చిపోయాడు!

By:  Tupaki Desk   |   17 July 2018 6:35 AM GMT
బిడ్డ‌కు పాలిచ్చింది.. చ‌చ్చిపోయాడు!
X
అమ్మ పాలు అమృతంతో స‌మానంగా చెబుతుంటారు. అమ్మ పాలు త‌ప్ప‌నిస‌రిగా బిడ్డ‌కు ఇవ్వాల‌ని.. అవే వారికి శ్రీ‌రామ ర‌క్ష‌గా చెబుతారు. కానీ.. అమెరికాలో అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి ఎదురైంది. క‌న్న‌బిడ్డ‌కు చ‌నుబాలు ఇచ్చిన త‌ల్లి.. త‌న క‌న్న‌బిడ్డ‌ను చంపుకున్న చిత్ర‌మైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌న చ‌నుబాలు పిల్లాడి ప్రాణాల్నితీసిన షాకింగ్ వైనం తెర మీద‌కు వ‌చ్చింది.

మొన్న‌టివ‌ర‌కూ జైల్లో ఉండి.. మూడు మిలియ‌న్ డాల‌ర్ల పూచీక‌త్తు మీద బెయిల్ తీసుకొని బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆమె వైనం ఇప్పుడు ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది.అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన స‌మంత జోన్స్ కు 11 నెల‌ల బాబు ఉన్నాడు. ఒళ్లు నొప్పులు ఉండ‌టంతో మాత్ర‌లు వేసుకొని ప‌డుకుంది. అయితే.. నిద్ర‌లో ప‌సికందు ఏడ‌వ‌టంతో బాబుకు పాలు ఇచ్చింది. ఉద‌యం లేచి చూసేస‌రికి ఆ చిన్నారి నుర‌గ క‌క్కుకొని ప్రాణాల్ని విడిచాడు. దీంతో కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేశారు.

పోస్ట్ మార్ట‌మ్ రిపోర్ట్‌ ను ప‌రిశీలించ‌గా.. విస్మ‌య‌క‌ర అంశాలు తెర మీద‌కు వ‌చ్చాయి. త్ల‌లిపాలు విషంగా మార‌ట‌మే చిన్నారి మ‌ర‌ణానికి కార‌ణంగా తేల్చారు. మెథ‌డోన్ తో కూడిన మందుల్ని తీసుకోవ‌టం వ‌ల్ల‌నే చిన్నారి ప్రాణాలు పోవ‌టానికి కార‌ణ‌మైందంటూ ప్రాసిక్యూష‌న్ వాదించారు. అయితే.. మెథ‌డోన్ మందులు వాడి బిడ్డ‌కు పాలు ఇవ్వొచ్చ‌న్న శాస్త్ర‌వేత్త‌ల వాద‌న‌ను స‌మంత త‌ర‌ఫు అటార్నీ వాదించారు.ఈ కేసు త‌దుప‌రి విచార‌ణ‌ను జులై 23కు వాయిదా వేశారు. ఒక‌వేళ‌.. సమంత త‌ప్పు చేసిన‌ట్లు తేలితే యావ‌జ్జీవ కారాగార శిక్ష ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.