Begin typing your search above and press return to search.
మెట్రోమ్యాన్ పై మోహన్‌లాల్ పొగడ్తల వర్షం..!
By: Tupaki Desk | 3 April 2021 8:46 AM GMTమెట్రోమ్యాన్ , బీజేపీ నేత శ్రీధరన్‌పై.. ప్రముఖ నటుడు మోహన్‌లాల్ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రస్తుతం కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్‌లాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అయితే ప్రస్తుతం అక్కడ వామపక్ష కూటమి.. బీజేపీతో తలపడుతున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలోకి వస్తే తానే సీఎంను అంటూ గతంలోనే శ్రీధరన్ ప్రకటించారు. ప్రస్తుతం కేరళలలో బీజేపీ.. వామపక్షకూటమి హోరాహోరిగా ప్రచారం చేసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌లాల్... శ్రీధరన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఏప్రిల్ 6 నుంచి అక్కడ మొదటి దశ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే మెట్రో మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ప్రముఖ ఇంజనీర్ శ్రీధరన్ కూడా కేరళ ఎన్నికల్లో పోటీచేస్తోన్న విషయం తెలిసిందే. పాలక్కాడ్ నియోజక వర్గ బీజేపీ అభ్యర్థిగా శ్రీధరన్ పోటీచేస్తున్నారు. తన గెలుపు ఖాయమని ఆయన ప్రకటించారు. అయితే తాజాగా మోహన్‌లాల్ శ్రీధరన్ పై పొగడ్తల వర్షం కురిపించారు.ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా ఆయనకు ఉందని.. పాంబన్ వంతెనను ఆయన కేవలం 46 రోజుల్లోనే నిర్మించారని.. ఢిల్లీ, కొచ్చి లాంటి ప్రాంతాల్లో ఆయన మెట్రో రైల్ ప్రారంభించారని పేర్కొన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో శ్రీధరన్ అవసరం ఎంతో ఉందని ఆయన చెప్పారు.
గతంలో శ్రీధరన్ కూడా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కేరళ అప్పుల్లో కూరుకుపోయిందని.. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. మోహన్‌లాల్ ప్రశంసలకు శ్రీధరన్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.మరోవైపు కేరళలో రాజకీయం వేడెక్కింది. ఈ సారి గట్టిపోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నది. మరోవైపు వామపక్ష కూటమి సైతం మరోసారి పట్టు నిలుపుకోవాలని చూస్తున్నది. కరోనా టైంలో కేరళ ప్రభుత్వం ఎంతో మెరుగైన సేవలు అందించిన విషయం తెలిసిందే.