Begin typing your search above and press return to search.

మోడీతో భేటి.. స్టార్ హీరో క్లారిటీ

By:  Tupaki Desk   |   22 Sept 2018 5:03 PM IST
మోడీతో భేటి.. స్టార్ హీరో క్లారిటీ
X
ఒక్క భేటి.. ఎన్నో అనుమానాలు.. ఆ స్టార్ హీరో బీజేపీలో చేరిపోయాడని ఒకరు.. కేరళకు అన్యాయం చేస్తున్న ప్రధాని మోడీతో అంటకాగారని మరొకరు.. 2019 ఎన్నికల్లో బీజేపీని కేరళలో లీడ్ చేసేది ఆ స్టార్ హీరోనే అని మరొకరు.. ఇలా రకరకాల ఊహాగానాలకు ప్రధాని మోడీ-మోహన్ లాల్ భేటి వేదికైంది. అప్పట్లో వీరిద్దరూ కలవడం.. మోహన్ లాల్ తన ట్విట్టర్ ఖాతాలో ఆ ఫొటోలు పోస్ట్ చేయడంతో కేరళ అంతటా దుమారం రేగింది. లోక్ సభ ఎన్నికల్లో మోహన్ లాల్ తిరువనంతపురం నుంచి బరిలోకి దిగబోతున్నాడని.. ఆర్ ఎస్ ఎస్ గట్టి మద్దతు తెలుపుతోందనే కథనాలు వెలువడ్డాయి.

ఇన్ని వరుస విమర్శల నేపథ్యంలో మనస్తాపానికి గురైన మోహన్ లాల్ ఎట్టకేలకు ఈ ఊహాగానాలకు తెరదించారు. ప్రధానితో భేటిపై ఫేస్ బుక్ వేదికగా వివరణ ఇచ్చారు. ‘ప్రధానితో తాను భేటి అయిన వార్తలపై దుష్ఫ్రచారం చేస్తున్నారు. ఓ భారత పౌరుడిగా నేను ఎప్పుడైనా ప్రధానిని కలవొచ్చు. ఈ భేటిలో ప్రధాని మోడీ నాతో ఒక్క రాజకీయ పదం కూడా మాట్లాడలేదు’ అంటూ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎమోషనల్ అయ్యి ఏకంగా 8 పేజీల లేఖను రాసి ఫేస్ బుక్ లో పెట్టారు. తనకు చెందిన విశ్వశాంతి ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న సేవ కార్యక్రమాలను మాత్రమే ప్రధానికి వివరించానని మోహన్ లాల్ వివరణ ఇచ్చారు.