Begin typing your search above and press return to search.
నాది జగన్ ది ఒకే రక్తం - వెరోనికా
By: Tupaki Desk | 25 March 2019 11:53 AM GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబు కోడలు - మంచు విష్ణు భార్య వైఎస్ కుటుంబానికి దగ్గరి బంధువు అని అందరికి తెలిసిందే. వైఎస్ సోదరుడు జార్జిరెడ్డి కుమార్తె వెరోనికా. వెరోనికాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మంచు విష్ణు. మొన్నటివరకు ఈ విషయంలో ఎవ్వరికీ అభ్యంతరాలు లేవు కానీ రెండు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వానికి - మోహన్ బాబుకి జరిగిన గొడవలో ఇప్పుడు అందరూ వెరోనికాను టార్గెట్ చేస్తున్నారు. మీరు వైసీపీ కుటుంబానికి దగ్గర అవ్వడం వల్లే ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో రాద్ధాంతం చేశారని నెటిజన్లు వెరోనికాను సూటిగా ప్రశ్నించారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నకు వెరోనికా కూడా చాలా కూల్ గా సమాధానం చెప్పింది. జగన్ నా సోదరుడు - అతని రక్తం - నా రక్తం ఒక్కటే. నా ఓటు జగన్ కే అని చెప్పింది. అన్నింటికి మించి ఏపీ నీడ్స్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్ కూడా పోస్ట్ చేసింది. దీంతో వెరోనికా డేర్ కు అందరూ హ్యాట్సాఫ్ చెప్తున్నారు.
మోహన్ బాబు తన కాలేజీలకు సంబంధించి ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల కోసం ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాడు. అయితే ప్రభుత్వం ఈ బకాయిల్ని విడుదల చేసేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో.. మోహన్‌బాబు ధర్నా చేశారు. ధర్నాలో కొన్ని కామెంట్స్ చేశాడు. దీనిపై స్పందించిన ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు.. కొన్ని ఆరోపణలు చేశారు. దానికి మోహన్ బాబు రిప్లై ఇచ్చారు. ఈలోగా ఏమైందో ఏమో.. మోహన్ బాబు సడన్ గా సైలెంట్ అయ్యారు. అయితే.. ఈ కారణంతో నెటిజన్లు వెరోనికాను టార్గెట్ చేశారు.