Begin typing your search above and press return to search.
నీ స్నేహితుడి భార్యను ఓడిస్తావా బాబూ?
By: Tupaki Desk | 18 April 2019 4:20 AM GMTచంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రే కాదని.. భవిష్యత్ లోనూ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు - వైసీపీ నేత మోహన్ బాబు. ట్విట్టర్ వేదికగా మోహన్ బాబు చేసిన ఈ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి.
అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పోలింగ్ సరళి చూశాక చంద్రబాబు పెడబొబ్బలు పెడుతున్నారు. ఈవీఎంల ట్యాంపరింగ్ అంటూ దేశవ్యాప్తంగా ఉద్యమానికి ఉసిగొల్పుతున్నాడు. విజయం పై ధీమా ఉంటే ఇలా చేస్తాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు జగన్ మాత్రం ఈవీఎంలపై.. విజయంపై ధీమాతో ఉన్నారు. అందుకే ఇక బాబు సీఎం కాలేడన్న అంచనాకు అందరూ వచ్చేశారు.
తాజాగా మోహన్ బాబు కర్ణాటకలో మాండ్యాలో పోటీచేస్తున్న తన తోటి హీరోయిన్ అయిన సుమలతకు మద్దతుగా ఓ ట్వీట్ చేశారు. ఇందులో తన స్నేహితుడు భార్య అంబరీష్ సతీమణి అయిన సుమలతను గెలిపించాలని ప్రజలను కోరారు. అంబరీష్ తో అవసరం ఉన్నంత వరకూ చంద్రబాబు వాడుకొని ఇప్పుడు ఆయన భార్యకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడని మోహన్ బాబు దుమ్మెత్తి పోశారు. ‘చంద్రబాబుకు కనీస విజ్ఞత లేదని.. సుమలతకు వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తున్నాడని.. బాబును విశ్వసించవద్దని’ మాండ్య ప్రజలను కోరారు. సుమలత తెలుగింటి ఆడపడుచు అని.. ఆమెను గెలిపించాలని ప్రజలను కోరాడు.
చంద్రబాబు మళ్లీ సీఎం అవుతానో కాదనన్న భావనతో ఇప్పుడు హడావుడిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన ముఖ్యమంత్రిగానే ఇంకా భావిస్తున్నాడు. ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కానీ ఇంకా ఆ పదవి నాదేనన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు దానికి కౌంటర్ గానే మోహన్ బాబు ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.