Begin typing your search above and press return to search.

బాబు వందేళ్లు బ‌త‌కాలి.. ఎన్నిక‌ల్లో ఓడాలి!

By:  Tupaki Desk   |   27 March 2019 1:30 AM GMT
బాబు వందేళ్లు బ‌త‌కాలి.. ఎన్నిక‌ల్లో ఓడాలి!
X
అనుకున్న‌దే జ‌రిగింది. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్లే ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్ బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ‌.. ప్ర‌భుత్వ తీరును త‌ప్పు ప‌డుతూ.. విద్యా సంస్థ‌ల‌కు ఇవ్వాల్సిన ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ అంశంపై రోడ్డెక్కిన మోహ‌న్ బాబు తీరు సంచ‌ల‌నంగా మారింది. మోహ‌న్ బాబు తీరును టీడీపీ నేత‌లు తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు.

ఇలాంటి వేళ పార్టీలో చేర‌టం ద్వారా మ‌రింత ఘాటుగా బాబును టార్గెట్ చేయొచ్చ‌ని భావించారో ఏమో కానీ.. ఫ్యాన్ పంచ‌న చేరిపోయారు. రానున్న రోజుల్లో బాబుకు దిమ్మ తిరిగే పంచ్ లు ఖాయ‌మ‌న్న రీతిలో మోహ‌న్ బాబు తాజాగా చేసిన వ్యాఖ్య‌లు నిద‌ర్శ‌నంగా చెబుతున్నారు. త‌న విద్యా సంస్థ‌కు ప్ర‌భుత్వం నుంచి రూ.19 కోట్ల బ‌కాయిలు ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు.

ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ స‌క్ర‌మంగా ఇవ్వ‌లేద‌ని.. దీని కార‌ణంగా కొన్ని కాలేజీల్లో జీతాలు ఇవ్వ‌లేద‌ని.. తాను మాత్రం సొంత ఆస్తుల్ని తాక‌ట్టు పెట్టి మ‌రీ జీతాలు ఇచ్చిన‌ట్లుగా చెప్పారు. చివ‌ర‌కు త‌న ఫిక్సెడ్ డిపాజిట్లు కూడా క‌దల్చాల్సి వ‌చ్చిన‌ట్లుగా పేర్కొన్నారు.

తాను చేప‌ట్టిన నిర‌స‌న ర్యాలీకి విద్యార్థుల్ని వినియోగించిన తీరును ప‌లువురు త‌ప్పు ప‌ట్ట‌గా.. ఈ అంశంపై మోహ‌న్ బాబు క్లారిటీ ఇచ్చే ప్ర‌యత్నం చేశారు. పిల్ల‌ల్ని నిర‌స‌న ర్యాలీకి తీసుకెళ్ల‌టంపై జ‌స్టిఫికేష‌న్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ కు సంబంధించిన డ‌బ్బులు ప్ర‌భుత్వం నుంచి తిరిగి రాని ప‌క్షంలో త‌న‌కు అండ‌గా నిల‌వాల‌ని విద్యార్థుల త‌ల్లిదండ్రుల్ని గ‌తంలోనే కోరాన‌ని.. అందుకు త‌గ్గ‌ట్లే నిర‌స‌న ర్యాలీకి విద్యార్థుల్ని తీసుకొచ్చిన దానికి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ఏపీలో ఉన్న ఫీజు బ‌కాయిల నేప‌థ్యంలో తెలంగాణ ప్ర‌భుత్వం కూడా పెద్ద ఎత్తున బ‌కాయిలు ప‌డిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో మోహ‌న్ బాబు క్లారిటీ ఇస్తూ.. తాము ఉప్ప‌ల్ లో న‌డుపుతున్న విద్యా సంస్థ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి బ‌కాయిలు లేవ‌న్నారు. తాను నిబంధ‌న‌ల‌కు త‌గ్గ‌ట్లు త‌మ విద్యాసంస్థ‌ను న‌డుపుతున్న‌ట్లుగా చెప్పారు.

పంచ‌భూతాల సాక్షిగా తాను చెప్పే అంశాల‌న్నీ ఎవ‌రికి భ‌య‌ప‌డో.. కేసీఆర్ కు బెదిరిపోయో చెప్ప‌టం లేద‌ని.. తెలంగాణ ప్ర‌భుత్వం ఎవ‌రి మీదా దాడులు చేయ‌లేద‌న్నారు. జ‌గ‌న్ ఏపీలో స్వీప్ చేస్తార‌ని చెప్పిన మోహ‌న్ బాబు.. బాబు సంతోషంగా వందేళ్లు జీవించాల‌ని.. రానున్న ఎన్నిక‌ల్లో మాత్రం త‌ప్ప‌నిస‌రిగా ఓడిపోవాల‌ని తాను కోరుకున్న‌ట్లుగా చెప్పారు. అయినా.. సంతోషంగా ఉండాలంటూ ఓడిపోవాల‌ని కోరుకోవ‌టం ఏమిటి మోహ‌న్ బాబు? ఓడిపోయాక‌.. అందునా చంద్ర‌బాబు లాంటి నేత‌కు ప‌వ‌ర్ దూర‌మయ్యాక సంతోషంగా ఉండ‌టం సాధ్యమ‌వుతుందా మోహ‌న్ బాబు?