Begin typing your search above and press return to search.
చంద్రబాబు నాపై చెప్పులేయించాడు: మోహన్ బాబు
By: Tupaki Desk | 7 April 2019 3:50 PM GMTఇటీవల వైసీపీలో చేరి టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్న మోహన్ బాబు మరోసారి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. తిరుపతిలో మోహన్ బాబు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మరణానికి మూమ్మాటికీ చంద్రబాబే కారకుడని ఆరోపించారు. చంద్రబాబు నాయుడి మాయ మాటలు నమ్మినందుకు తన మీద చెప్పులు పడ్డాయని తెలిపారు. అనంతరం తన తప్పు తాను తెలుసుకుని ఎన్టీఆర్‌ను కలిశానని చెప్పారు.
ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత తాను రాజకీయల్లోకి రాలేదని.. ఒక్కసారి మాత్రం బీజేపీకి ప్రచారం చేశానని చెప్పారు. 2009లో వైవీఎస్ చౌదరీకి చెక్ ఇచ్చిన మాట వాస్తవమేనన్నారు. రాష్ట్రంలో మొట్టమొదట ఫీజురీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ లాంటి పది మంచి పథకాలను ప్రవేశపెట్టిన మహానేత వైఎస్ ఆర్ అని కొనియాడారు. పదేళ్లు ప్రజా సమస్యల పట్ల పోరాడుతూ సుదీర్ఘ పాదయాత్ర చేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని ప్రశంసించారు. వైఎస్ ఆర్ ఆశయాలను, ప్రజల సమస్యలను నెరవేర్చడానికి పోరాడుతోన్న వ్యక్తి వైఎస్ జగనేనన్నారు.
వైఎస్ కుటుంబానికి, మంచు ఫ్యామిలీకి బంధుత్వం ఉందన్నారు. చంద్రబాబు మూర్ఖుడని, అతని స్థాయి ఏంటి, తన స్థాయి ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు ఆస్తి ఏంటి, తన ఆస్తి ఏంటి..బాబు ఎలా సంపాదించాడో ప్రజలకు తెలుసునన్నారు. ఓటుకు నోటు కేసులో భయంతో హైదరాబాద్ వదిలి పారిపోయిన సీఎం చంద్రబాబేనని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టిన దుర్మార్గుడు చంద్రబాబేనని ఆరోపించారు. చంద్రబాబు లాంటి నీచమైన వ్యక్తిని తన జీవితంలో చూడలేదన్నారు. విదేశాల్లో ఉండే తెలుగు వారి మధ్య కూడా చంద్రబాబు కులాలు అంటూ చిచ్చు పెట్టాడని ఆరోపించారు. టీడీపీ చంద్రబాబుది కాదని, ఎన్టీఆర్ నుంచి లాక్కున్నాడని విమర్శించారు.