Begin typing your search above and press return to search.
కమాన్ సిరాజ్.. మేమంతా నీ వెంటే ఉన్నాం.. ! మ్యాచ్ ముందు కన్నీళ్లు పెట్టుకున్న సిరాజ్..
By: Tupaki Desk | 7 Jan 2021 8:07 AM GMTమహ్మద్ సిరాజ్ క్రికెట్ జీవితం ఎందరో యువకులకు ఆదర్శం. సాధించాలన్న కసి, పట్టుదల ఉంటే ఏ అడ్డంకి మనల్ని ఏమి చేయాలని నిరూపించాడు హైదరాబాద్కు చెందిన ఈ యువ ఫేసర్. నిజానికి సిరాజ్ ఓ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి ఓ ఆటోడ్రైవర్. ఇప్పుడు భారత్జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న సిరాజ్ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాడు. గల్లీలో ప్రాక్టీస్ చేసిన సిరాజ్. ఇప్పుడు మనదేశానికి గర్వకారణంగా అయ్యాడు. ప్రస్తుతం టీం ఇండియా ఆస్ట్రేలియా టూర్లో ఉన్న విషయం తెలిసిందే. సిరాజ్ ఆస్ట్రేలియా టూర్కు ఎంపికయ్యాడు. అయితే అయితే అతడు ఆస్ట్రేలియాలో ఉండగానే తండ్రి చనిపోయాడు. కానీ సిరాజ్కు లేక లేక ఈ అవకాశం వచ్చింది. తన తండ్రి కోరిక కూడా అదే.
అయితే అతడు భారత్కు వెళ్లి తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బీసీసీఐ అనుమతి ఇచ్చింది కూడా .. కానీ సిరాజ్ అందుకు వెళ్లలేదు. అందుకు కారణం అతడు ఒకవేళ ఇండియా వెళ్లినా.. మళ్లీ ఆస్ట్రేలియా వస్తే క్వారంటైన్లో ఉండాల్సి వస్తుంది. అలా చేస్తే అతడు జట్టుకు ఆడే అవకాశం కోల్పోతాడు. దీంతో సిరాజ్ తండ్రిని కడసారి కూడా చూడలేకపోయాడు. ఇటీవల జరిగిన టెస్ట్మ్యాచ్కు ముందు ఇరు జట్ల ప్లేయర్లు జాతీయగీతం ఆలపిస్తుండగా.. సిరాజ్ ఒక్కసారిగా ఏడ్చేశాడు. తన తండ్రి గుర్తుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. నెటిజన్లు మాత్రం సిరాజ్కు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. ‘సిరాజ్ భారత క్రికెట్ అభిమానులు మొత్తం నీ వెంటే ఉన్నారు.. దయచేసి ధైర్యం కోల్పోకు’ అంటూ వాళ్లు కామెంట్లు పెట్టారు. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా గురువారం ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది.
అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ కు తన తండ్రి (మొహ్మద్ గౌస్) గుర్తొచ్చి కన్నీరు పెట్టుకున్నాడు. మొహ్మద్ సిరాజ్ తండ్రి మొహ్మద్ గౌస్ (53) ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతూ ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. సిరాజ్ మాత్రం తన తండ్రి కోరికను నెరవేర్చేందుకు క్రికెట్ ఆడాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. ఆడిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో (2/40, 3/37) ఐదు వికెట్లు దక్కించుకున్నాడు.