Begin typing your search above and press return to search.

జర్నీలో రోహిత్‌ భాయ్ చేసిన పనికి నిద్రపోలేదు : సిరాజ్

By:  Tupaki Desk   |   5 Jun 2021 1:30 PM GMT
జర్నీలో రోహిత్‌ భాయ్ చేసిన పనికి నిద్రపోలేదు : సిరాజ్
X
క్రికెట్ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని ప్రారంభించిన ప్రపంచ టెస్ట్ చాంపియన్‌ షిప్ లో విజేత ఎవరో మరికొద్ది రోజుల్లోనే తెలియబోతుంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌ షిప్ ఫైనల్ లో ఇండియా , న్యూజిలాండ్ తో తలపడబోతుంది. ఈ సిరీస్ కోసం అలాగే , రూట్‌ సేనతో ఐదు టెస్ట్‌ సిరీస్‌ ల కోసం టీమిండియా గురువారం యూకేలో ల్యాండ్ అయింది. భారత్ నుంచి ప్రత్యేక విమానంలో పురుషుల, మహిళల జట్లు లండన్‌ కు చేరుకున్నాయి. క్రికెటర్లంతా విమానాల్లో సందడి చేస్తుండగా తీసిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో షేర్‌ చేసింది. ఇండియా నుండి యూకే కి విమాన ప్రయాణ సమయంలో ఆటగాళ్లు ఏ రకంగా గడిపారో కొందరు క్రికెటర్లు చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో భారత యువ స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన ప్రయాణ విషయాలను తెలుపుతూ.. ప్రశాంతంగా నిద్రపోతుంటే రోహిత్ శర్మ తన నిద్రకు భంగం కలిగించాడని తెలిపాడు. దీంతో సరిగా నిద్ర పోలేదని తెలిపాడు. ఇప్పుడే ఎయిర్‌ పోర్ట్‌ లో ల్యాండ్ అయ్యాం. హోటల్‌ కు వెళ్లడానికి రెండు గంటలు సమయం పడుతుంది. విమాన ప్రయాణంలో రెండు గంటలు మంచిగా నిద్రపోయాను. ఆ తర్వాత రోహిత్ భాయ్ వచ్చి లేపాడు. ఇక అంతే ఆ తర్వాత మళ్లీ నిద్ర రాలేదు. సరిగ్గా విమానం ల్యాండ్ అయ్యే రెండు గంటల ముందు మళ్లీ కాస్త నిద్రపోయా. నిన్న కాస్త ఎక్కువగానే రన్నింగ్ సెషన్‌ లో పాల్గొన్నాం. దాంతో నేను చాలా అలసిపోయాను అని సిరాజ్ ఆ వీడియోలో తన ప్రయాణ అనుభవాన్ని తెలిపాడు.

జూన్ 18వ తేదీ నుంచి భార‌త్‌, న్యూజిలాండ్ జ‌ట్టు సౌతాంప్ట‌న్‌ లోని రోజ్ బౌల్ మైదానంలో వ‌ర‌ల్డ్ టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో త‌ల‌ప‌డ‌తాయి. అయితే ముందుగా లండ‌న్‌ లోని లార్డ్స్ మైదానంలో మ్యాచ్‌ ను నిర్వ‌హించాల‌ని అనుకున్నా త‌రువాత ఐసీసీ ఆ వేదిక‌ను రోజ్ బౌల్‌ కు మార్చింది. టెస్టు చాంపియ‌న్ షిప్‌ లో భార‌త్ ఇప్ప‌టి వ‌రకు ఆడిన మ్యాచ్‌ల ప్ర‌కారం 520 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో తొలి స్థానంలో నిలిచింది. 420 పాయింట్ల‌తో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. దీంతో టాప్ 2 లో నిలిచిన భార‌త్‌, న్యూజిలాండ్‌ల మ‌ధ్య టెస్టు చాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ మ్యాచ్‌ ను నిర్వ‌హించ‌నున్నారు

https://twitter.com/BCCI/status/1400680486851080199?s=20