Begin typing your search above and press return to search.
వారెవ్వా షమీ.. 400 వికెట్ల క్లబ్ లోకి ఎంట్రీ..!
By: Tupaki Desk | 10 Feb 2023 10:13 AM GMTభారత్ లోని నాగ్ పూర్ వేదికగా ఆస్ట్రేలియా-టీం ఇండియా మధ్య తొలి టెస్ట్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో భారత టాప్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 450 వికెట్లను పడగొట్టాడు. తద్వారా కేవలం 89 మ్యాచుల్లోనే 450 వికెట్లు తీసిన స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ రికార్డు నెలకొల్పిన సంగతి తెల్సిందే. ఇక ఇదే మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్ షమీ సైతం తన పేరిట ఒక రికార్డు నెలకొల్పడం విశేషం.
నాగ్ పూర్ లో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ డెవిడ్ వార్నర్ ను అవుట్ చేశాడు. తద్వారా 400 వికెట్ల క్లబ్బులోకి షమీ చేరారు. ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మట్లలో కలిపి షమీ 400 వికెట్ల మైలురాయిని అందుకొని సత్తా చాటాడు.
భారత్ తరుపున 400 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో షమీ తొమ్మిదవ స్థానంలో నిలిచాడు. భారత పేస్ బౌలర్ల విషయానికొస్తే మాత్రం షమీ ఐదో స్థానంలో ఉన్నాడు. షమీ కంటే ముందువరుసలో కపిల్ దేవ్.. జహీర్ ఖాన్.. శ్రీనాథ్.. ఇషాంత్ శర్మ ఉన్నారు. ఇక మిగిలిన వాళ్లంతా కూడా స్పిన్నర్లే ఉన్నారు.
కాగా భారత్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన వారి జాబితాను పరిశీలిస్తే అనిల్ కుంబ్లే 953 వికెట్లతో అందరి కంటే ముందున్నాడు. ఆ తర్వాత హర్భజన్ సింగ్ 707.. కపిల్ దేవ్ 687... రవిచంద్రన్ అశ్విన్ 672.. జహీర్ ఖాన్ 579.. జవగల్ శ్రీనాథ్ 551.. రవీంద్ర జడేజా 482... ఇష్మాంత్ శర్మ 434.. మహ్మద్ షమీ 400లతో ఉన్నారు.
మహ్మద్ షమీ ఇప్పటివరకు ఆడిన 61 అంతర్జాతీయ టెస్టుల్లో 217 వికెట్లు తీశారు. 87 వన్డేల్లో 159 వికెట్లను.. 23 టీ20ల్లో 24 వికెట్లను పడగొట్టాడు. మొత్తంతా నాగ్ పూర్ టెస్టులో టీం ఇండియా కంగారు జట్టును కంగారు పెట్టించే ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.