Begin typing your search above and press return to search.
ఐదు నిమిషాల్లో నా ఇంగ్లీష్ అయిపోతుంది .. అఫ్గాన్ కెప్టెన్ వ్యాఖ్యలు వైరల్ !
By: Tupaki Desk | 29 Oct 2021 2:30 AM GMTఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీకి నేరుగా వచ్చిన 8 జట్లలో ఆఫ్ఘనిస్థాన్ కూడా ఒకటి. ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించే కొద్ది రోజుల ముందు అఫ్గాన్ కెప్టెన్ గా ఉన్న రషీద్ ఖాన్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కెప్టెన్, బౌలర్ గా తాను న్యాయం చేయలేనని రషీద్ స్పష్టం చేశాడు. దాంతో అఫ్గాన్ జట్టు పగ్గాలను మొహమ్మద్ నబీ అందుకున్నాడు. ఇక బ్యాటింగ్ లో నజీబుల్లా జద్రాన్.. బౌలింగ్‌లో ముజీబ్ ఉర్ రహమాన్ విజృంభించడంతో టీ20 ప్రపంచకప్ లో అఫ్గానిస్థాన్ ఘనంగా బోణీ కొట్టింది.
అఫ్గాన్ స్కాట్లాండ్ ను 130 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే ఈ మ్యాచులో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్కాట్లాండ్‌పై విజయం సాధించిన అనంతరం అఫ్గాన్ కెప్టెన్ మొహమ్మద్ నబీ మీడియాతో మాట్లాడేందుకు వచ్చాడు. సాధారణంగా ప్రతి మ్యాచ్ తర్వాత ఇరు జట్ల కెప్టెన్‌లు వచ్చి విలేకర్లతో మాట్లాడటం మామూలే. అయితే ఇక్కడే ఓ తమాషా సన్నివేశం జరిగింది. నబీకి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. అయితే ఉర్దూను మాత్రం బాగా మాట్లాడగలడు. సాధారణంగా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఇంగ్లీష్ బాషలోనే ప్రశ్నలు అడుగుతుంటారు.
అయితే ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలవ్వడానికి వేచి ఉన్న సమయంలో నబీ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. అందులో ఏముందంటే.. మీడియాను ఎదుర్కోవడం చాలా కష్టమైన పని బ్రదర్. నేను నిజంగా చెబుతున్నా. కొంచెం టెన్షన్ గా కూడా ఫీల్ అవుతున్నా. ఇంతకీ ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి బ్రదర్ అని మీడియా మేనేజర్‌ను నబీ అడుగుతాడు. అవతలి వ్యక్తి నుంచి వచ్చిన సమాధానానికి స్పందిస్తూ.. అలా అయితే ఐదు నిమిషాల్లో నా ఇంగ్లీష్ అయిపోతుంది అని నబీ నవ్వుతూ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో చూసిన అందరూ నవ్వులు పూయిస్తున్నారు.
స్కాట్లాండ్ తో జరిగిన మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. నజీబుల్లా జద్రాన్ (34 బంతు ల్లో 59; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేయగా , హజ్రతుల్లా జజాయ్ (44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రహ్మానుల్లా (46; ఒక ఫోర్, 4 సిక్సర్లు) ధాటిగా ఆడారు. స్కాట్లాండ్ బౌలర్ షరీఫ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన స్కాట్లాండ్ 10.2 ఓవర్లలో 60 పరుగులకే ఆలౌటైంది. అఫ్గాన్ స్టార్ బౌలర్లు ముజీబ్ ఉర్ రహమాన్ (5/20), రషీద్ ఖాన్ (4/9) చెలరేగిపోయారు. టీ20 ఫార్మాట్‌లో తామెంత ప్రమాదకారులమో అఫ్గాన్ ప్లేయర్స్ మరోసారి ప్రపంచానికి చాటారు. తొలుత బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ స్కోరు చేసిన అఫ్గాన్.. ఆపై స్పిన్ ఉచ్చులో బిగించి ప్రత్యర్థిని ఆలౌట్ చేశారు. ఛేదనలో తొలి మూడు ఓవర్లు మాత్రమే పోటీలో ఉన్న స్కాట్లాండ్.. ముజీబ్ చేతికి బంతి చేరడంతోనే పరాజయం అంచుల్లో కూరుకుపోయింది. గ్రూప్ 2లో ఉన్న అఫ్గాన్.. పాకిస్తాన్, న్యూజీలాండ్, భారత్ లాంటి పటిష్ట జట్లను ఎదుర్కోవాల్సి ఉంది