Begin typing your search above and press return to search.
మోడీ తీరుపై మండిపడిన యూఏఈ షేక్
By: Tupaki Desk | 27 Aug 2018 1:31 PM GMTకేరళ వరదల ముప్పు సద్దుమణిగినప్పటికీ...ఆ రాష్ట్రం కేంద్రంగా సాగుతున్న రాజకీయాలు మాత్రం ఇంకా ఓ కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా వరద సహాయం విషయంలో జరుగుతున్న కామెంట్ల వర్షం కొనసాగుతోంది. కేరళ బాధితుల కోసం యూఏఈ 700 కోట్ల సాయాన్ని ప్రకటించింది. అయితే ఆ సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం తిరస్కరిస్తున్నది. ఈ నేపథ్యంలో యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్.. భారత్ కు చురక వేశారు. యూఏఈ ప్రధాని తన ట్వీట్ లో ఓ ఆసక్తికరమైన అంశాన్ని పోస్టు చేశారు. రెండు ట్వీట్లతో మోడీపై కామెంట్లు చేశారు. యూఏఈ ప్రధాని చేసిన ట్వీట్లు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
యూఏఈ సహాయాన్ని కేరళ ఆహ్వానించినా.. భారత ప్రభుత్వం మాత్రం దాన్ని తిరస్కరించింది. దీంతో ఆ అంశం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో యూఏఈ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్ మంచి పరిపాలకుడు ఎలా ఉండాలన్న అంశాన్ని తన ట్వీట్లలో సూచించారు. కొందరు నాయకులు ప్రజాసంక్షేమం కోసం పని చేస్తారని, మరి కొందరు మాత్రం కేవలం చట్టాలకు పరిమితమై కొందరి జీవితాలకు విఘాతంగా మారుతారని ట్వీట్ చేశారు. మొదటి ట్వీట్ లో ఆయన నేతల గొప్ప తనాన్ని వర్ణించారు. ప్రజలకు సేవ చేసేందుకు మంచి నాయకుడు సంతోషంగా ముందుకు వస్తారని రాశారు. తన దగ్గర ఉన్నది అందరికీ ఇస్తాడని, ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తాడని ఆయన ఆ ట్వీట్ లో తెలిపారు. ఇక రెండవ ట్వీట్ లో నేతల వైఖరిని యూఏఈ ప్రధాని విమర్శించారు. కొందరు నేతలు ప్రజల జీవితాలకు సమస్యగా మారుతారన్నారు. ప్రజలు తమ వెంటే ఉండాలన్న ఆశతో వాళ్లు ఉంటారన్నారు. అదే సంతోషంగా వాళ్లు భావిస్తారన్నారు. అయితే మొదటి తరహా నేతలు ఉంటేనే.. రాష్ర్టాలు - ప్రభుత్వాలు వర్ధిల్లుతాయని యూఏఈ ప్రధాని తన ట్వీట్ లో తెలిపారు.