Begin typing your search above and press return to search.

130 మంది భార్యలకు శోకాన్నే మిగిల్చాడు

By:  Tupaki Desk   |   31 Jan 2017 7:08 AM GMT
130 మంది భార్యలకు శోకాన్నే మిగిల్చాడు
X
ఒక పెళ్లాంతోనే పడలేమంటూ జోకుల మీద జోకులు వేసుకునే వారుచాలామందే కనిపిస్తారు. అలాంటిది 130 మంది భార్యలకు భర్తగా ఫేమస్ అయిన వ్యక్తి పరిస్థితి ఏమిటి? వివాదాస్పద మత బోధకుడిగా సుపరిచితుడు.. 203 మంది పిల్లలకు తండ్రి అయిన నైజీరియాకు చెందిన 93 ఏళ్ల అబూ బకర్ అంతు చిక్కని వ్యాధితో కన్నుమూశారు.

పవిత్ర గ్రంధానికి వింత భాష్యాలు చెప్పటంతో పాపులర్ అయిన ఆయన..ఒక మగాడు ఎంతమంది మహిళల్ని అయినా పెళ్లి చేసుకోవచ్చని చెబుతుంటారు. తన మాటలకు తగ్గట్లే 130 మంది మహిళల్ని వివాహం చేసుకున్న ఆయన.. వారి ద్వారా 203 మంది పిల్లలకు తండ్రి కావటం గమనార్హం.

మొత్తం 130 మంది భార్యలు.. పిల్లలతో కలిసి రెండంతస్తుల భవనంలో నివసించే ఆయన పేరిట.. ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబమన్న రికార్డు కూడా ఉంది. విస్మయానికి గురి చేసే అంశం ఏమిటంటే.. బకర్ కన్నుమూసిన సమయానికి ఆయన భార్యల్లో కొందరు గర్భవతులుగా కూడా ఉండటం. చనిపోవటానికి కొన్ని రోజుల ముందు.. దేవుడు తనకు అప్పగించిన పని ముగిసిందని తన అనుచరులకు చెప్పాడట. ఇంతకీ ఆయన మరణానికి కారణమైన వ్యాధి ఏమిటన్నది ఇంకా తేలలేదు. ఎక్కువ మంది భార్యలున్న ఏకైక భర్త శాశ్విత నిద్రలోకి జారిపోయినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/