Begin typing your search above and press return to search.

రాజకీయ గ్రౌండ్ లో సైలెంట్ అయిన కెప్టెన్

By:  Tupaki Desk   |   25 July 2020 7:00 AM GMT
రాజకీయ గ్రౌండ్ లో సైలెంట్ అయిన కెప్టెన్
X
భారత దేశ క్రికెట్ జట్టును సమర్థంగా నడిపించిన మాజీ కెప్టెన్ అజారుద్దీన్ గ్రౌండ్ లో బాగానే ఆడినా.. రాజకీయ గ్రౌండ్ లో మాత్రం సమకాలీన రాజకీయాల్లో చిక్కి శల్యమైపోతున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యలో సైలెంట్ అయిపోయాడు.

దారుణమైన మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఇరుకున్న అజారుద్దీన్ కు జాతీయ కాంగ్రెస్ పార్టీనే లైఫ్ ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీగా దించి గెలిపించింది. ఐదేళ్లలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అజారుద్దీన్ క్రేజ్ ను సాంతం వాడేసుకుంది. ప్రతీచోట క్యాంపెయిన్ చేయించింది. మైనార్టీ, పైగా దిగ్గజ క్రికెటర్ కావడంతో ముస్లిం ఓటు బ్యాంకును అజారుద్దీన్ ఆకర్షించాడు.

ఇక 2014 ఎన్నికల్లో అజారుద్దీన్ సొంత రాష్ట్రం తెలంగాణకు కాంగ్రెస్ పంపింది. ఇక్కడ టీఆర్ఎస్, ఎంఐఎంకు పోటీగా దింపింది. కానీ అజారుద్దీన్ తుస్సుమన్నాడు.

ఆ తర్వాత హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లో ఏకంగా అధికార టీఆర్ఎస్ సపోర్టుతో అధ్యక్షుడిగా గెలిచాడు అజారుద్దీన్. అప్పటి నుంచి కాంగ్రెస్ తో టచ్ లో లేకుండా పోయారు. మంత్రి కేటీఆర్ ప్రోద్బలంతో హెచ్.సీ.ఏపై పాగా వేశారు. టీఆర్ఎస్ లో చేరుతారనే ప్రచారం జరిగినా అజహర్ అధికారికంగా చేరలేదు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు దూరంగా.. అలాగని గులాబీ పార్టీకి దగ్గరగా ఉండడం లేదు. అజహర్ అడుగులు ఎటువైపన్నది ఆసక్తిగా మారింది.