Begin typing your search above and press return to search.

మూడో పెళ్లి కాలేదంటూ అజ్జూ ట్వీట్

By:  Tupaki Desk   |   21 Dec 2015 6:13 AM GMT
మూడో పెళ్లి కాలేదంటూ అజ్జూ ట్వీట్
X
మాజీ క్రికెటర్.. పార్ట్ టైం రాజకీయ నేత మహ్మద్ అజహరుద్దీన్ తన థర్డ్ ఇన్నింగ్స్ పై సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తాజాగా ఆయన ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్నారంటూ.. మీడియాలో ప్రముఖంగా వార్త రావటం.. దాన్ని అందరూ ఫాలో కావటంతో.. అజ్జూకి మూడో పెళ్లి జరిగిపోయిందన్నట్లుగా పరిస్థితి చోటు చేసుకుంది. అయితే.. తాను మూడో పెళ్లి చేసుకోలేదంటూ.. తాజాగా ట్విట్టర్ ద్వారా పేర్కొన్నాడు. మీడియాలో వచ్చినట్లుగా తనకు మూడో పెళ్లి కాలేదని .. ఆ వార్తలు నిజం కావని ఖండించాడు.

అయితే.. అజ్జూ మూడో పెళ్లి వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావటానికి రెండు ప్రధాన కారాణాల్ని చూపిస్తున్నారు. ఈ మధ్యన ముంబయిలో తన కారు డ్రైవర్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన అజ్జూ.. తన వెంట తీసుకెళ్లిన షానన్ (గర్ల్ ఫ్రెండ్ అయినా అని అనొచ్చా?)ను తన భార్యగా వారికి పరిచయం చేసుకున్నట్లుగా చెబుతున్నారు. దీంతో.. అజ్జూ మూడో పెళ్లి మీద వార్తలు మీడియాలో వచ్చేశాయి.

ఇక.. ఢిల్లీలో జరుగుతున్న ఐటీపీఎల్ లీగ్ మ్యాచ్ లో షానన్ తో కలిసి మ్యాచ్ చూసిన నేపథ్యంలో.. వీరి మధ్య అనుబంధం ముదిరి పాకాన పడినట్లుగా భావించారు. మొత్తంగా మీడియా అజ్జూ మూడో పెళ్లి (?) వార్తల్ని ప్రముఖంగా ప్రచురిస్తే.. తాజాగా ట్విట్టర్ లో తనకు మూడో పెళ్లి కాలేదంటూ స్పష్టం చేస్తూ.. ఖండన ట్వీట్ పెట్టారు. మరి.. అజ్జూకి మూడో పెళ్లి కాలేదన్నట్లేనా?