Begin typing your search above and press return to search.

గల్లాపై రెడ్డిగారి టీజింగ్ కొనసాగింపు!

By:  Tupaki Desk   |   22 March 2019 11:39 AM GMT
గల్లాపై రెడ్డిగారి టీజింగ్ కొనసాగింపు!
X
‘అరండల్ పేట్ లో వదిలితే.. బ్రాడీ పేట్ లోకి రాగలడా..’ఇదీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పై ఆయన ప్రత్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సంధించిన ప్రశ్న. గల్లా జయదేవ్ ఐదేళ్ల పాటు ఎంపీగా వ్యవహరించినా.. స్థానికేతరుడే అని వేణుగోపాల్ రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. అందులో భాగంగా.. ఈ విధమైన టీజింగ్ ను కొనసాగిస్తూ ఉన్నారు.

ఇక ఐదేళ్లలో గల్లా గుంటూరును ఉద్ధరించింది ఏమిటని.. ఆయన ఒక అతిథి ఎంపీగా కొనసాగారని మోదుగుల అంటున్నారు. గల్లా గుంటూరు ఛాయలకు రాకపోవడం పై మొదటి నుంచి విమర్శలున్నాయి. మూడేళ్ల నుంచినే ఈ అంశం చర్చలో ఉంది. అయితే గల్లాను ఎంతో హెచ్చుగా చూపించేందుకు మీడియా ఉంది. గల్లా స్థానికులకు అందుబాటులో లేకపోయినా.. ఆయనను ఒక హీరో ఎంపీగా చిత్రీకరిస్తూ వస్తోంది తెలుగుదేశం అనుకూల మీడియా. ఈ నేపథ్యంలో ఆయనకు మళ్లీ కూడా టికెట్ దక్కింది.

ఇక మోదుగుల రూపంలో గల్లాకు గట్టి ప్రత్యర్థి ఎదురవుతున్నాడిప్పుడు. గల్లా మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు మోదుగుల. గల్లా స్థానికత గురించి మోదుగుల టీజింగ్ ను కొనసాగిస్తూ ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో ఎన్ని సార్లు గుంటూరు నియోజకవర్గం పరిధిలో పర్యటించిందీ చెప్పాలని, ఈ విషయంలో శ్వేతపత్రం విడుదల చేయాలని గల్లాను డిమాండ్ చేశారు మోదుగుల.

అలాంటి జయదేవ్ ను ఓడించడానికే తను గంటూరు నుంచి ఎంపీగా పోటీకి దిగినట్టుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. మంగళగిరిలో లోకేష్ కు కూడా ఓటమి తప్పదని మోదుగుల జోస్యం చెప్పారు. గల్లాకు ఎంపీ పదవి ఆభరణం అని, తనలాంటి వాటికి అది ఆయుధం అని.. తాము విజయం సాధించి రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించి తీరతామని మోదుగుల సవాల్ విసిరారు.