Begin typing your search above and press return to search.
కేసీఆర్ దూకుడు ముందు మోడీషాలు తేలిపోతున్నారా?
By: Tupaki Desk | 7 April 2023 11:00 PM GMTకొన్ని థ్రిల్లర్ సినిమాల్లో విషయాన్ని ముందు చెప్పరు. సంబంధం లేని సీన్లు తెర మీదకు వస్తాయి. ఆసక్తిని పెంచుతాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకుడి అంచనాలకు తగ్గట్లుగా ఉండటం ఒక ఎత్తు అయితే.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం అంచనాలకు అందని రీతిలో రివీల్ అవుతుంది. అప్పటి వరకు సంబంధం లేని అంశాలుగా కనిపించే అంశాలు.. చివర్లో ఒక్కసారిగా ఒకదానితో మరొకటి కలిసి.. అసలు విషయం అర్థమయ్యేలా చేస్తుంది. ఈ సందర్భంగా ప్రేక్షకుడు విపరీతమైన థ్రిల్ కు ఫీల్ అవుతాడు.
తెలంగాణలోనూ అలాంటి పరిస్థితే ఉందన్న మాట వినిపిస్తోంది. కేంద్రంలోని మోడీ సర్కారుకు రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వానికి మధ్య ఏ మాత్రం పొసగని విషయం తెలిసిందే. తమ సత్తా చాటేందుకు నిదానమే ప్రధానం అన్నట్లుగా మోడీ అండ్ కో సాగుతుంటే.. అందుకు భిన్నంగా కేసీఆర్ మాత్రం తన చేతికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని విడవకుండా దూకుడును ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్ తో రాజకీయ క్రీడ అంత తేలిక కాదన్న భావన మోడీషాల మదిలో నిండుగా ఉంటుందని.. అందుకే.. వారు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
ఈ కారణంతోనే కేసీఆర్ ఎంత దూకుడుగా నిర్ణయాలు తీసుకున్నా.. అందుకు సంబంధం లేని రీతిలో మోడీషాల నిర్ణయాలు ఉన్నాయని చెబుతారు. తాము టార్గెట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పతిప్పలు పెట్టి.. మూడు చెరువులు నీళ్లు తాగించే వైనాలు ఇప్పటికే చాలానే చూశాం. ఆయనపై దూకుడుగా దూసుకెళ్లిన ఎంతోమంది ఫైర్ బ్రాండ్ లను వారు నిలువరించిన తీరు దేశ ప్రజలు చూసిందే. ఎవరిదాకానో ఎందుకు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సంగతే తీసుకుంటే.. అసెంబ్లీ ఎన్నికల వేళ.. మోడీషా వర్సెస్ మమత మధ్య సాగిన రాజకీయ యుద్ధం ఎంత తీవ్రంగా సాగిందో తెలిసిందే.
ఇప్పటి కేసీఆర్ కంటే కూడా దూకుడుగా వ్యవహరించిన దీదీ.. ఆ తర్వాతి కాలంలో కామ్ అయిపోవటం కనిపిస్తుంది. తనది కాని టైం అన్నట్లుగా ఆమె.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న ధోరణి కనిపిస్తుంది. అందులో భాగంగా మోడీషాలతో పంచాయితీ పెట్టుకోవటానికి అంత ఆసక్తి చూపకపోవటం కనిపిస్తుంది. అలాంటి మమతకే సినిమా చూపించిన మోడీషాలు.. కేసీఆర్ విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సందర్భంగా కొందరు కేసీఆర్ ను మోడీ షాలే ప్లాంట్ చేశారంటూ అర్థం వాదనలను వినిపిస్తున్నారు.
ఒకవేళ అదే నిజమైతే.. మోడీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ రోజువారీగా అంత ఘాటుగా మాటలు అనిపించకుంటారా? ఒకట్రెండు సందర్భాల్లో అనే మాటల్నే మోడీ జీవితాంతం గుర్తుంచుకొని.. సదరు నేత 'సంగతి' చూసే వరకు నిద్రపోని లక్షణం ఉన్న మోడీ.. కేటీఆర్ లాంటి నేత చేత మాటలు అనిపించుకోవటానికి ఇష్టపడతారా? ఇక్కడ అందరిని వేధిస్తున్న సందేహం.. మంత్రి కేటీఆర్ అంతేసి పెద్ద మాటలు అంటున్నప్పటికి మోడీషాలు మౌనంగా ఉండటం.. తమను అనే మాటల్ని లెక్కలు వేసుకోవటమే తప్పించి.. పెద్దగా రియాక్టు కాకపోవటం వెనుక లెక్కలు వేరుగా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు అవుతారని బలంగా వాదనలు వినిపించినా.. అందుకు భిన్నంగా ఆమెను అరెస్టు చేసేందుకు ఈడీ అంతగా ఆసక్తిని ప్రదర్శించకపోటం.. అదే సమయంలో టెన్త్ పేపర్ లీక్ ఎపిసోడ్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడ్ని రిమాండ్ కు పంపిన వైనం చూస్తే.. మోడీషాలు ఆచితూచి ఆడుతుంటే.. కేసీఆర్ మాత్రం విపరీతమైన దూకుడును ప్రదర్శిస్తున్న ధోరణి కనిపించక మానదు. మొత్తంగా చూస్తే.. తెలివైన శత్రువును ఎదుర్కొనే విషయంలో బలమైన ప్రత్యర్థి ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తారు.
కేసీఆర్ విషయంలో మోడీషాల అదే సూత్రాన్ని పాటిస్తున్నారని చెబుతున్నారు. థ్రిల్లర్ సినిమాలో మాదిరి.. సంబంధం లేని అంశాలు కొన్ని చోటు చేసుకోవటం (ఉన్నట్లుండి సుఖేశ్ సీన్లోకి రావటం). . చివరకు భారీ సీన్ తెర మీదకు రావటం లాంటిదే త్వరలో తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకునే వీలుందన్న మాట వినిపిస్తుంది. మరేం జరుగుతుందో కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.