Begin typing your search above and press return to search.

మోడీ మ్యాజిక్ పని చేసిందే ..!

By:  Tupaki Desk   |   11 Nov 2019 8:30 PM GMT
మోడీ మ్యాజిక్ పని చేసిందే ..!
X
దేశం లో ఆర్థిక మాంద్యం మొదట పడింది పరిశ్రమ రంగాల పైనే.. ముఖ్యం గా వాహన విక్రయాలు దారుణంగా పడి పోయాయి. మారుతి లాంటి దిగ్గజ కంపెనీ లే కార్ల ఉత్పత్తి ని బంద్ చేశాయి. ఆటో మోబైల్ పరిశ్రమ మొత్తం కుదేలైన వేళ మోడీ సర్కారు భారీ ఉద్దీపన పథకాలు, రాయితీలు, సబ్సిడీల తో ఆ రంగానికి ఊతమిచ్చింది. ఆ ఫలితం తాజా గా కనపడింది.

దేశం లోనే ఇంత క్లిష్ట ఆర్థిక మందగమనానికి పండుగలు జోష్ నిచ్చాయి. కుదేలైన ఆటో మొబైల్ రంగానికి దసరా, దీపావళి పండుగ సేల్స్ తో కొంత ఊరట లభించింది.

తాజాగా సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫాక్చరర్స్ సొసైటీ (ఎస్ఐఏఎం) విడుదల చేసిన గణాంకాల్లో గత నెలలో భారత్ లో వాహనాల విక్రయాలు 0.28 శాతం పెరగడం విశేషం. గత ఏడాది అక్టోబర్ లో దేశంలో 2,84,223 వాహనాలు విక్రయించ గా.. ఈ ఏడాది పండుగల సీజన్ అక్టోబర్ లో ఆర్థిక మాంద్యం వెంటాడుతున్న కూడా 2,85,027 వాహనాలు అమ్ముడు పోయాయని ఎస్ఐఏఎం తెలిపింది.

పండుగలు, మోడీ ఉద్దీపనల తో ఆటో మోబైల్ రంగం దేశంలో కోలుకుంది. ఇప్పటికే 21.14శాతం మేర తగ్గించిన వాహనాల ఉత్పత్తిని కంపెనీలు పునరుద్దరిస్తున్నాయి.