Begin typing your search above and press return to search.

పార్లమెంటు మారిపోతుంది

By:  Tupaki Desk   |   6 Aug 2016 7:13 AM GMT
పార్లమెంటు మారిపోతుంది
X
భారత పార్లమెంటు కొన్నేళ్లలో కొత్త భవనంలోకి మారనుంది. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. పార్లమెంటు కొత్త భవనం కోసం గతంలోనే స్పీకర్ చేసిన సూచనలు ఇప్పుడు కార్యరూపం దాలుస్తున్నాయి. సభాపతి సూచనలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం రాజ్‌పథ్‌ లోని ‘వాయు భవనం’ వెనుక భాగం లో కొత్త భవనాన్ని నిర్మించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతం ప్రస్తుతమున్న భవనానికి ఒక కిలోమీటర్‌ కంటే తక్కువ దూరంలోనే ఉంటుంది.

ప్రస్తుత పార్లమెంట్‌ భవనం 1927నుంచి ఉపయోగంలో ఉంది .అప్పట్లో పార్ల మెంటు సభ్యులు తక్కువగా ఉండటంతో ఎటువంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ ఇప్పుడు 550 మంది సభ్యులు - మంత్రుల కార్యాలయాలు ఇతరత్రా విధులకు భవనం చాలా ఇరుకుగా తయారయ్యింది. 88సంవత్సరాల వయసుగల ఈ భవనం కాస్త ప్రమాదకరంగా కూడా కనిపిస్తుండటంతో నూతన భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు.

వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌-81(3) ప్రకారం నూతన నిర్మాణానికి ఆదేశాలి చ్చారు. త్వరలో నిర్మించబోయే భవనాన్ని అద్భుత సాంకేతికతను జోడించి కా గితరహితంగా డిజిటల్‌ కార్యాలయాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ప్ర స్తుత పార్లమెంట్‌ భవనంనుంచి నూతన భవనానికి సొరంగ మార్గాన్ని నిర్మిం చాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుత భవనాన్ని వారసత్వ సంపదగ ప్రకటించి ప్రజల సందర్శనార్థంఅందుబాటులోకి తేనున్నట్లు కూడా తెలుస్తోంది.