Begin typing your search above and press return to search.

మోడీ తమ్ముడు కేసీఆర్.. ఈ వ్యాఖ్యను చేసిందెవరో తెలుసా?

By:  Tupaki Desk   |   26 Jan 2021 7:30 AM GMT
మోడీ తమ్ముడు కేసీఆర్.. ఈ వ్యాఖ్యను చేసిందెవరో తెలుసా?
X
ఒకప్పుడు దేశంలో వామపక్ష వాదులు వెలిగిపోయిన వేళ.. ఆమె ఒక కీలక నేత. ఆమె మాటకు చాలానే ప్రాధాన్యత ఉండేది. కానీ.. తర్వాతి కాలంలో ఆమె ప్రభ మసకబారింది. అయినప్పటికి అప్పుడప్పుడు తన వ్యాఖ్యలతో వార్తల్లోకి వస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్యే ఆమె నోటి నుంచి వచ్చింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్‌. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రజా గర్జన సభలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా వ్యతిరేకత విధానాలతో నియంతలా ప్రధాని మోడీ పాలన సాగిస్తున్నారన్నారు. ఇకపై ఆయన ఆటలు సాగవని.. రైతులతో పాటు అన్ని వర్గాల వారి నుంచి వ్యతిరేకత మొదలైనట్లు ఆమె చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతు ఈ రోజు రోడ్లెక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందో ప్రజలు గమనిస్తున్నారన్నారు.

అంబానీ.. అదానీలకు మేలు చేయటం కోసమే కేంద్రంలో కొత్త చట్టాల్ని తెచ్చారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మోడీ తమ్ముడు కేసీఆర్ పొద్దున ఒక మాట.. సాయంత్రానికి మరో మాట అన్న తీరుతో వ్యవహరిస్తారన్నారు. హరితహారం పేరుతో పేదల నుంచి భూములు లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల మంది ఆదివాసీలు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే.. ఇప్పటివరకు సగం కూడా ఇవ్వలేదంటూ మండిపడ్డారు. ఇప్పటివరకు ఎవరూ పోల్చని రీతిలో కేసీఆర్ ను మోడీ సోదరుడుగా అభవర్ణించిన ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.