Begin typing your search above and press return to search.

ఏం తెలివో?: మోడీకి ఓటు ఉంటే నాకే ఓటు వేసేవారు

By:  Tupaki Desk   |   11 May 2019 5:30 PM GMT
ఏం తెలివో?:  మోడీకి ఓటు ఉంటే నాకే ఓటు వేసేవారు
X
విమ‌ర్శించే వ్య‌క్తిని వాడుకోవ‌టం ఎక్క‌డైనా చూశారా?  ఇప్ప‌టివ‌ర‌కూ అల‌వాటు లేని ఈ తీరును భ‌లేగా ప్ర‌ద‌ర్శించి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నారు ఆర్జేడీ సీనియ‌ర్ నేత ర‌ఘువంశ్ ప్ర‌సాద్ సింగ్. మోడీని అవ‌కాశం వ‌చ్చిన ప్ర‌తిసారీ త‌ప్పుప‌ట్టే ఆయ‌న‌.. తాజాగా మోడీ పేరును కొత్త త‌ర‌హాలో వాడేశారు. బిహార్ లో ఆర్జేడీ.. కాంగ్రెస్ పార్టీలుక‌లిసి మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే.

వీరికి పోటీగా బీజేపీ.. జేడీయూలు జ‌త క‌ట్టి బ‌రిలోకి దిగాయి. ఇలాంటివేళ‌.. బిహారీలంతా మ‌హాకూట‌మికే మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్లుగా ర‌ఘువంశ్ చెప్పారు. కొంద‌రు మోడీ.. మోడీ అని నినాదాలు చేస్తున్నార‌ని.. కానీ తాను బ‌రిలో ఉన్న వైశాలీలో మోడీకి కాని ఓటు ఉంటే ఆయ‌న సైతం త‌న‌కే ఓటు వేసేవారంటున్నారు.

ఇక్క‌డి ప్ర‌జ‌లు కూడా తాను చెప్పిన మాట‌నే చెబుతున్న‌ట్లుగా ర‌ఘువంశ్ చ‌మ‌త్క‌రిస్తున్నారు. ఎన్నిక‌లంతా ఏక‌ప‌క్షంగా సాగుతున్నాయ‌ని.. బీజేపీ.. జేడీయూలోని కొద‌ద్ఇ మంది నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు ఆర్జేడీకి మ‌ద్ద‌తుగా నిలుస్తున్న‌ట్లు చెప్పారు. యూపీఏ హ‌యాంలో కేంద్ర‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన ర‌ఘువంశ్ ప్ర‌సాద్ స‌మ‌యంలోనే ఉపాధి హామీ ప‌థ‌కం అమ‌ల్లోకి వ‌చ్చింది.

తాను మ‌రోసారి గెలిచి.. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. ఉపాధి హామీ ప‌థ‌కాన్ని మ‌రింత విస్తృతం చేస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు. అగ్ర‌కులాల్లో పేద‌ల‌కు రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌న్న మోడీ నిర్ణ‌యం ప్ర‌మాద‌క‌రంగా ర‌ఘువంశ్ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి త‌న‌కున్న ఇమేజ్ ఎంత భారీ అన్న విష‌యాన్ని తెలిసేలా.. మోడీ సైతం త‌న‌కే ఓటు వేస్తాన‌న్న రఘువంశ్ ప్ర‌సాద్ కు వైశాలీ ఓట‌ర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.