Begin typing your search above and press return to search.
తెలంగాణ దినోత్సవం... ఏపీకి మోడీ విషెస్!
By: Tupaki Desk | 2 Jun 2018 7:32 AM GMTనేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ ప్రభుత్వం - ప్రజలు ఘనంగా జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ....ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న మోదీ ట్వీట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజల కలలు, ఆంకాంక్షలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...’’ అని ట్వీట్ చేశారు. ఏపీలో జరుగుతున్న నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ఆంధ్రా ప్రజలకు కూడా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ఆంధ్ర ప్రదేశ్ లోని నా సోదర - సోదరీమణులకు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలంతా సుసంపన్నంగా - సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను...’’ అని మోదీ ట్వీట్ చేశారు.
2014 - జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగిన విషయం తెలిసిందే. అదే రోజున సీమాంధ్ర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయింది. తెలంగాణ ఏర్పడి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. నేడు తెలంగాణ రాష్ట్ర 4వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ఈ ఎస్ ఎల్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ నాలుగేళ్లలో బడుగు - బలహీన వర్గాల సంక్షేమం - అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని నరసింహన్ అన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా ప్రభుత్వం చూడాలని అన్నారు. ప్రజా సంక్షేమం - సంతోషమే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు. నవ తెలంగాణాను బంగారు తెలంగాణగా మార్చే ప్రక్రియలో ప్రభుత్వానికి విజయం చేకూరాలని నరసింహన్ ఆకాంక్షించారు. భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు సుఖశాంతులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.