Begin typing your search above and press return to search.
దేశంలో మరో కొత్త అద్భుతానికి బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది
By: Tupaki Desk | 10 Dec 2020 5:06 AM GMTదేశంలో మరో కొత్త అద్భుతానికి బీజేపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్న పార్లమెంట్ స్థానంలో కొత్త భవనాన్ని అత్యాధునిక సదుపాయాలతో నిర్మించడానికి కేంద్రం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నేతలు, పలు దేశాల రాయబారులు సహా సుమారు 200 మంది స్పెషల్ గెస్టులుగా హాజరు కాబోతున్నారు.
ఈ కార్యక్రమంలో దేశంలో అన్ని రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు వర్చువల్ గా హాజరుకానున్నారు. కరోనా సమయం కాబట్టి ఎక్కువమందిని ఆహ్వానించలేదు. త్రిభుజాకారంలో.. అత్యాధునిక ఇంధన సామర్ధ్యంతో.. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా సౌకర్యాలు నూతన పార్లమెంటులో ఉంటాయి. లోక్ సభ ప్రస్తుత పరిమాణానికి 3 రెట్లు, రాజ్యసభ గణనీయమైన స్థాయిలో విశాలంగా నిర్మాణం జరగబోతోంది. అడుగడుగునా భారతీయత ఉట్టిపడేలా మొత్తం 64,500 చదరపు మీటర్ల పరిధిలో ఈ నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మించనున్నారు. భూకంపాలు, ఇతర ప్రకృతి విపత్తులను తట్టుకునేలా ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. పార్లమెంట్ భవన నిర్మాణానికి రూ.971 కోట్లు అవుతుందని అంచనా వేశారు. ఈ భవన నిర్మాణ బాధ్యతలను దిగ్గజ సంస్థ ‘టాటా’ చేపట్టింది.
విశాలమైన ఈ భవనంలో లోక్ సభ సభ్యుల కోసం 888 సీట్లు, రాజ్య సభ సభ్యుల కోసం 326 సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. పార్లమెంట్ ఉభయ సభల సమావేశం జరిగితే, లోక్ సభ లో ఒకేసారి 1224 మంది సభ్యులు కూర్చునేలా సీట్లు ఏర్పాట్లు చేస్తారు.మొత్తం 18.37 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంతో నిర్మించే పార్లమెంట్ విస్టా భవనం ప్రాజెక్టు కోసం రూ.11,794 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలోనే ఈ కొత్త భవన నిర్మాణానికి సంకల్పించినట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.