Begin typing your search above and press return to search.
ఉద్యోగులపై మోడీ పెన్షన్ అస్త్రం... తెరపైకి ఎన్పీఎస్!
By: Tupaki Desk | 22 Jun 2023 2:50 PM GMTకర్ణాటక ఎన్నికల తర్వాత ఆందోళన లో ఉన్న బీజేపీ పెద్దలు ప్రభుత్వ ఉద్యోగుల ను టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది. బీజేపీ యేతర పార్టీలన్నీ ఏకమవుతూ కాంగ్రెస్ వైపు చూస్తున్న తరుణం లో ముందు జాగ్రత్త చర్యల కు దిగుతుంది. ఇందులో భాగంగా కొత్త పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చూస్తుంది. ఇప్పటికే ఉన్న పెన్షన్స్ స్థానంలో ఈ కొత్త విధానాన్ని తెర పైకి తేవాలని భావిస్తోంది.
2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి వరకు ఉన్న ఓల్డ్ పెన్షన్ స్కీం (ఓపీఎస్)ను రద్దుచేసింది. దానిస్ధానం లో కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ కొత్త పెన్షన్ విధానాన్ని పలురాష్ట్రాల ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ విషయం లో కొన్ని రాష్ట్రాలు పూర్తిగా ఈ విధానాన్ని పక్కన పెడుతుండగా... మరికొన్ని రాష్ట్రాలు కొత్త విధానాన్ని తెర పైకి తెస్తున్నాయి.
ఈ నేపథ్యం లోనే ఏపీ లో జగన్ సర్కార్ జీపీఎస్ (గ్యారెంటీ పెన్షన్ స్కీం) ని తెచ్చింది. ఇలా ఇన్నేసి రకాల పెన్షన్ స్కీంస్ ఉండగా... తాజాగా నరేంద్రమోడీ ప్రభుత్వం ఎన్పీఎస్ (నేషనల్ పెన్షన్ స్కీం) అనే కొత్త విధానాన్ని తేబోతున్నట్లు సమాచారం.
ఇందులో భాగంగా... 45 శాతం పెన్షన్ హామీకి కొత్త పద్దతి లో గ్యారెంటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఉద్యోగి చివరి జీతం లో ఇపుడు 38 శాతం పెన్షన్ గా వస్తోన్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని 45 శాతానికి పెంచి ప్రభుత్వ ఉద్యోగుల ను ఆకర్షించాలని మోడీ ఆలోచిస్తున్నారట. అయితే... ఓపీఎస్ పద్దతి లో 50 శాతం పెన్షన్ వచ్చేది. ఇదే సమయంలో సీపీఎస్ లో 38 శాతం వస్తుంది. అయితే 50% అంత కాకపోయినా.. 38శాతం కంటే ఎక్కువగానే ఉంది కాబట్టి.. ఈ కొత్త విధానం వల్ల పార్టీకి ప్రయోజనం కలుగుతుందని మోడీ సర్కార్ ఆలోచిస్తుందంట.
ఇదే సమయం లో ఈ కొత్త ఎన్పీఎస్ విధానంతో నాన్ బీజేపీ ప్రభుత్వాల ను ఇరుకున పెట్టాలని మోడీ ఆలోచిస్తున్నారట. కారణం... ఈ కొత్త పెన్షన్ స్కీం ని అమలుచేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాల పై అదనంగా మరో 7శాతం భారం పడుతుంది!
ఆ సంగతి అలా ఉంటే... ఈ పథకం అమలు లోకి వచ్చిన తర్వాత రిటైరైన వారికి మాత్రమే వర్తిస్తుందని అంటున్నారు. అయితే ఈ కొత్త విధానం పై మరింతగా ఇంటర్నల్ చర్చ జరిగిన అనంతరం, అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత మోడీ ఈ విషయం పై ఆలోచిస్తారని అంటున్నారు.