Begin typing your search above and press return to search.

జవాన్లతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోడీ !

By:  Tupaki Desk   |   13 Nov 2020 4:57 PM GMT
జవాన్లతో దీపావళి జరుపుకోనున్న ప్రధాని మోడీ !
X
భారతదేశ ప్రధాని ప్రతి సంవత్సరం మాదిరే ఈ సంవత్సరం కూడా దిపావళి పండుగను సరిహద్దుల్లోని జవాన్లతో కలిసి జరుపుకోనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. భద్రతా దళాలతో దీపావళి జరుపుకునేందుకు నరేంద్రమోడీ సరిహద్దుల్లోని ఓ పోస్ట్ దగ్గరకు వెళ్లనున్నట్లు సమాచారం. దీపావ‌ళి వేడుక‌ల‌ను రాజ‌స్థాన్‌ లో నిర్వ‌హించ‌నున్నారు. జైస‌ల్మేర్‌ లో ఉన్న సైనికుల‌తో ఆయ‌న సెల‌బ్రేట్ చేసుకోనున్నారు. దేశ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన నాటి నుంచి ప్ర‌ధాని మోదీ.. ప్ర‌తి దీపావ‌ళి పండుగ‌ను స‌రిహ‌ద్దుల్లో ఉన్న సైనికుల‌తో జ‌రుపుకుంటున్నారు.

అయితే జైస‌ల్మేర్‌ లో జ‌వాన్ల‌ను క‌లిసేవారిలో మోదీతో పాటు సీడీఎస్ బిపిన్ రావ‌త్ కూడా ఉంటారు. గ‌తంలో ప్ర‌ధాని మోదీ, పాకిస్థాన్‌, చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్న సైనికుల్ని దీపావ‌ళి వేళ క‌లిశారు. గ‌తంలో ప్ర‌ధాని మోదీ.. పాకిస్థాన్‌, చైనా స‌రిహ‌ద్దుల్లో ఉన్న సైనికుల్ని దీపావ‌ళి వేళ క‌లిశారు. జ‌వాన్ల‌కు మోదీ స్వీట్లు షేర్ చేశారు. గ‌త ఏడాది రాజౌరీ జిల్లాలోని నియంత్ర‌ణ రేఖ వ‌ద్ద ఉన్న ఆర్మీ ద‌ళాల‌తో మోదీ దీపావ‌ళి జ‌రుపుకున్నారు.

2018లో ఉత్తరాఖండ్ లోని బోర్డర్ పొజిషన్ వద్ద దీపావళిని జవాన్లతో సెలబ్రేట్ చేసుకున్నారు మోడీ. 2017లో నార్త్ కశ్మీర్ లోని గురేజ్ సెక్టార్ లో దీపావళి వేడుకలు జవాన్లతో కలిసి జరుపుకున్నారు. 2015లో పంజాబ్ బోర్డర్ లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు మోడీ. భారత ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 2014లో..సియాచిన్ గ్లేసియర్ బేస్ క్యాంప్ వద్ద జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు మోడీ. శ‌నివారం రోజున ఈ ఏడాది దీపావ‌ళి దేశ‌వ్యాప్తంగా సెల‌బ్రేట్ చేసుకోనున్నారు.