Begin typing your search above and press return to search.
2.3 అడుగుల మరుగుజ్జు పెళ్లికి హాజరుకానున్న మోదీ..!
By: Tupaki Desk | 30 Oct 2022 2:30 PM GMTజన్యు పరమైన లోపాల కారణంగా కొంతమందిలో ఎదుగుదల లేక మరుజ్జులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి వారి పట్ల సమాజంలో కొంత చులకన భావం ఉంటోంది. అయితే వీటిని మరుగుజ్జులు.. అవయవలోపం ఉన్నవాళ్లు ఎంతో ధైర్యంగా ఎదుర్కొంటూ తాము ఎవరికీ తీసిపోరని నిరూపించిన ఘటనలు అనేకం ఉన్నాయి.
ఇలాంటి వారిని సమాజంలోని ప్రతీ ఒక్కరు ఆదర్శంగా తీసుకొని తమ జీవితంలో ముందడుగు వేస్తున్నారు. తాజాగా ఓ మరుగుజ్జుకు సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
2.3 అడుగుల ఎత్తు ఉండే అజీమ్ మన్సూరి 3 అడుగుల యువతిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. తన వివాహానికి హాజరు కావాలని ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి.. యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్ లను కోరుతున్నాడు. ఈ మేరకు త్వరలోనే ఢిల్లీకి వెళ్లి ప్రధానిని కలుస్తానని అజీమ్ చెబుతున్నాడు.
ఉత్తర ప్రదేశ్ లోని షామ్లీ జిల్లాలో అజీమ్ మన్సూరి(మరుగుజ్జు) నివసిస్తున్నాడు. ఇతడి ఎత్తు 2.3 అడుగులు మాత్రమే. యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే అజీమ్ హైట్ కారణంగా పెళ్లి కూతురు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే తనకు తెలిసిన వారందరికీ పెళ్లి కూతురిని వెతకమని చెప్పేవాడు.
2019లో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ను కూడా కలిసి విన్నవించుకున్నాడు. పెళ్లి కూతురు కోసం చాలా ఏళ్లపాటు వెతకగా చివరికి ఒకచోట సంబంధం కుదిరింది. గతేడాది మార్చిలో మూడు అడుగుల పొడవు ఉన్న బుషారాను కలిశాడు. ఈ ఏడాది ఏప్రిల్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. బుషారా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని అజీమ్ తో చెప్పింది.
ఈ క్రమంలోనే వీరిద్దరికి నవంబర్ 7న పెళ్లికి పెద్దలు ముహుర్తం నిర్ణయించారు. ఇటీవలే పెళ్లికి షేర్వానీ.. త్రీ పీస్ సూట్ ను కుట్టించుకున్నాడు. తన పెళ్లికి రావాలని త్వరలోనే ప్రధాని మోదీని.. సీఎం యోగీ ఆదిత్య నాథ్ ను కలుస్తానని అజీమ్ చెబుతున్నాడు.
ఇదిలా ఉంటే అజీమ్ ప్రస్తుతం షామ్లీ జిల్లాలో ఓ షాపు నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. 5వ తరగతి చదివిన అజీమ్ డిగ్రీ చదివిన బుషారాను పెళ్లి చేసుకోబోతుండటం గమనార్హం. వీరి జీవితం నిండు నూరేళ్లు హ్యాపీ గా సాగాలని కోరుకుందాం..!