Begin typing your search above and press return to search.

మోడీ ఒడిశా టూర్‌.. సీఎం న‌వీన్ తీవ్ర అసంతృప్తి.. రీజ‌నేంటి?

By:  Tupaki Desk   |   3 Jun 2023 9:49 PM GMT
మోడీ ఒడిశా టూర్‌.. సీఎం న‌వీన్ తీవ్ర అసంతృప్తి.. రీజ‌నేంటి?
X
దేశాన్ని రోజు రోజంగా నిర్ఘాంత పోయేలా చేసి, తీవ్ర‌చ‌ర్చ‌నీయాంశంగా మార్చిన ఘ‌ట‌న ఒడిశా రైలు ప్రమాదం. ఏం జ‌రిగిందో ఏమో.. మూడు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘ‌ట‌న‌లో 290 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే.. ప్ర‌మాద ఘటనాస్థలిని ప్రధాని మోడీ హుటాహుటిన ఢిల్లీ నుంచి వ‌చ్చి సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ప్రధాని మోడీ పరామర్శించారు.

క్షేత్ర‌స్థాయిలో పరిస్థితిని, సహాయక చర్యలను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్ తో కలిసి మోడీ ప్రత్యక్షంగా పరిశీలించారు. రైలు ప్రమాద ఘటన గురించి అక్కడున్న అధికారులను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల గురించి ఆరా తీశారు.

ఒడిశా కేబినెట్ సెక్రటరీ, ఆరోగ్య శాఖ మంత్రిలో ప్రధాని మోడీ మాట్లాడారు. బాధితులకు అండగా ఉండాలని వారిని ప్రధాని మోడీ కోరారు. ఘటనాస్థలిలో అధికారులు చేపట్టిన పునురుద్ధరణ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రైలు ప్రమాద ఘటనాస్థలిని పరిశీలించిన అనంతరం ప్రధాని మోడీ.. బాలేశ్వర్లో క్షతగాత్రుల చికిత్స పొందుతున్న ఆస్పత్రిని సందర్శించారు. క్షతగాత్రుల బాగోగులను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.

అయితే.. మోడీ ప‌ర్య‌ట‌న‌, ఆయ‌న ప‌రిశీల‌న‌ల‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ప్ర‌ధాని మోడీ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించ‌డం ప‌ట్ల ఒడిశా సీఎం న‌వీన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్ర‌స్తుతం క్ష‌త‌గాత్రుల‌ను ర‌క్షించేందుకువారికి వైద్యం అందించేందుకు తాము అహ‌ర్నిశ‌లుక‌ష్ట ప‌డుతున్నామ‌ని.. ఇలాంటి కీల‌క స‌మయంలో ప్ర‌ధాని రావ‌డంతో ఉన్న‌తాధికారులు అంద‌రూ ప్రొటోకాల్ ప్ర‌కారం ఆయ‌న సేవ‌లో ఉన్నార‌ని.. సీఎంవో అభిప్రాయ‌ప‌డింది.

మ‌రోవైపు.. ఇదే అంశాన్ని ప్ర‌స్తావించిన నెటిజ‌న్లు.. ప్ర‌ధాని మోడీ అంత‌టి వారు.. ఇప్ప‌టికిప్పుడు ఇక్క‌డ‌కు రాకుండా ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఆయ‌న రావ‌డంతో స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను మూడు గంట‌ల పాటు నిలిపివేశార‌ని.. ఇత‌ర అధికారుల‌ను కూడా రానివ్వ‌లేద‌ని.. కేంద్ర బ‌ల‌గాలు.. ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకోవ‌డంతో క్షేత్ర‌స్థాయిలో బాధితుల‌కు సేవ‌లు నిలిచిపోయాయ‌ని.. కొంద‌రు వ్యాఖ్యానించారు. ప్ర‌ధాని మోడీ మ‌రొక్క‌రోజు త‌ర్వాత వ‌చ్చి ఉంటే బాగుండేద‌ని అనేవారు పెరుగుతున్నారు.