Begin typing your search above and press return to search.

మోడీ ఏం చెప్పారు...? ఏం చేశారు..?

By:  Tupaki Desk   |   24 May 2015 1:30 PM GMT
మోడీ ఏం చెప్పారు...? ఏం చేశారు..?
X
బీజేపీ తురుపుముక్కగా.. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థిగా భారతదేశ ఎన్నికల గోదాలో దిగి అంతాతానై దేశాన్ని చుట్టబెట్టి మునుపెన్నడూ లేని ప్రచార రీతులతో... కట్టిపడేసే ప్రసంగాలతో, కళ్లకు కట్టే భవిష్యత్‌ ప్రణాళికలతో నరేంద్రమోడీ గత ఏడాది లోక్‌ సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించారు. 125 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్‌ కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి ప్రధాని పీఠం నిండు విశ్వాసంతో కూర్చున్నారు. 2014 మే 26న ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మోడీ పాలనకు ఏడాది పూర్తవుతోంది. ఎన్నికల నుంచి అధికారం చేపట్టేవరకు బీజేపీ, మోడీ ప్రజలకు అనేక వాగ్గానాలు ఇచ్చారు. అందులో తక్షణం చేసేవి... దీర్ఘకాలంలో అమలు చేసేవీ రెండు రకాలూ ఉన్నాయి. కానీ, మోడీ ఏడాది పాలనలో ఏమీ చేయలేకపోయారని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే... ఎంతో చేశారంటూ బీజేపీ చెబుతోంది. మోడీ ఏం చేశారు... ఏం చేయలేకపోయారన్న సంగతి పక్కనపెడితే బీజేపీ, మోడీ ఇచ్చిన ప్రధాన హామీలేంటన్నవి ఈ సందర్భంగా ఒక్కసారి మననం చేసుకుందాం. అందులో ఫలించినవి ఏవి... నెరవేర్చలేకపోయినవి ఏవి... ప్రాసెస్‌ లో ఉన్నవి ఏవి... పక్కకు తప్పుకున్నవి ఏవి అనేది పాఠకులే నిర్ణయించుకోవచ్చు.



- అవినీతి నిర్మూలన

- విదేశాల్లో దాచిన నల్ల ధనాన్ని భారత్‌ కు తీసుకొచ్చి ప్రతి భారతీయునికి 15 నుంచి 20 లక్షలు పంచడం.

- మౌలిక వసతులతో గృహసౌకర్యం

- స్వయం ఉపాధి దిశగా యువతను నడిపించడం

- కేంద్ర, రాష్టాల మధ్య సమన్వయానికి ప్రధానిని ముఖ్యమంత్రులను సమానంగా పరిగణించే టీం ఇండియా నిర్మాణం.

- రాష్ట్రాలకు ఆర్థిక స్వయం ప్రతిపత్తి

- చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో పరిపాలనా వికేంద్రీకరణ

- వేర్పాటువాద ఉద్యమాలపై పరిశీలించి నిర్ణయం తీసుకోవడం. వీలైతే ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు

- గంగానది సహా నదుల ప్రక్షాళన

- జాతీయ విద్యా విధానం అమలు

- ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు

- భారత ఆహార సంస్థ పనివిధానాన్ని సేకరణ, నిలువ, వితరణలుగా విభజించి సామర్థ్యాన్ని పెంచడం

- జాతీయ వ్యవసాయ మార్కెట్‌ రూపకల్పన

- వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటక రంగాలలో శ్రామిక ప్రాధాన్యంతో ఉద్యోగాల కల్పన

- అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెటింగ్‌ను ఆపడం

- వ్యవసాయోత్పత్తుల రవాణాకు ప్రత్యేక రైలు మార్గాలు

- పాలనలో మహిళల ప్రాతినిధ్యం పెంచడం

- అయోధ్యలో రామాలయ నిర్మాణం - కాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు - ఉమ్మడి పౌరస్మృతి

గరుడ