Begin typing your search above and press return to search.
ఉన్నట్లుండి మోడీ లావైపోతారేంటి చెప్మా?
By: Tupaki Desk | 25 Dec 2016 5:55 AM GMT ప్రధాని మోడీని నిశితంగా పరిశీలిస్తుంటారు. ఇప్పటివరకూ దేశానికి ప్రధానమంత్రిగా చేసిన వారిలో తమ డ్రెస్సులతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన వారు కొద్దిమందే. అందులోనూ ప్రధాని వేసుకునే దుస్తుల మీదా.. ఆయన ఫ్యాషన్స్ మీదా తరచూ విమర్శలు వెల్లువెత్తటం కూడా మోడీ ఇష్యూలోనే మొదలైందని చెప్పక తప్పదు. మోడీని విమర్శించాలనుకునే వారు ఆయన అవినీతి చేశారన్న ఆరోపణలు చేయరు కానీ.. ఆయన రోజూ చాలానే దుస్తులు మార్చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.
వేలాది కోట్లు అవినీతి చేయని వ్యక్తి.. రోజుకు నాలుగు డ్రెస్సులు మార్చుకుంటే నష్టమేమిటన్న ప్రశ్నకు విపక్షాలు బదులివ్వవు అయినా.. ఈ దేశంలో డ్రెస్సులు వేసుకునే అదృష్టం కూడా లేదా? అన్న సందేహం కలుగుతుంది రాహుల్ గాంధీ లాంటి వారి మాటలు విన్నప్పుడు. నాలుగు రోజులకో డ్రెస్సు మార్చుకుంటే.. కోట్లాది రూపాయిల అవినీతి చేస్తే ఓకేనా? అన్న ప్రశ్నకు సమాధానం ఉండదు.
మోడీ డ్రెస్సుల ముచ్చటనుకాస్త పక్కన పెడితే.. ఆయన కొన్ని సందర్భాల్లో బొద్దుగా కనిపిస్తుంటారు. మరికొన్ని సందర్భాల్లో చాలా సన్నగా కనిపిస్తారు.ఈ మధ్యన జనం దృష్టిని విపరీతంగా ఆకర్షించిన రెండు ఉదంతాల్ని చూస్తే.. తమిళనాడు ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తూ.. అనారోగ్యంతో మరణించిన ‘‘అమ్మ’’ జయలలిత మరణించిన వేళ.. ఆమెకు నివాళులు అర్పించేందుకు ప్రధాని మోడీ చెన్నైకి వచ్చారు. ఈ సందర్భంగా తెల్లటి కుర్తా - పైజమా ధరించారు. ఆ డ్రెస్సులో చూసినప్పుడు ఆయన సన్నగా.. రివాటులా కనిపిస్తారు. అది కట్ చేస్తే.. తాజాగా తన ముంబయి పర్యటనలో భాగంగా ఆయన్నుచూస్తే చాలా బొద్దుగా కనిపిస్తారు. రోజుల వ్యవధిలో ఇంత బొద్దుగా ఎలా మారిపోయారన్నది సందేహం కలుగుతుంది. మరీ ముఖ్యంగా.. పొట్ట భాగంలో ఆయన చాలా దుబ్బుగా ఉన్నట్లుగా కనిపిస్తారు. ఎందుకిలా అంటే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. బహిరం సభలు.. కార్యక్రమాలకు వచ్చే వేళ.. అత్యాధునిక బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ వినియోగించటం కారణంగా ఆయన లావుగా కనిపిస్తారని చెబుతారు. ఈ లెక్కన అమ్మకు నివాళి అర్పించేందుకు వచ్చినప్పుడు ఆయనెలాంటి రక్షణ సాధనాల్ని వినియోగించకుండా వచ్చినట్లుగా చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/