Begin typing your search above and press return to search.

ఇవిగో లెక్కలు...మోడీ గ్రాఫ్ పడిపోయింది

By:  Tupaki Desk   |   26 May 2016 9:12 AM GMT
ఇవిగో లెక్కలు...మోడీ గ్రాఫ్ పడిపోయింది
X
2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై బీజేపీ - ఎన్‌ డీఏ అనేక ఆశలు పెట్టుకున్నాయి. మోడీ ప్రచారం చేస్తే అధికారం తమదే అనే ధీమా కనిపించేది. 2014లో అది కనిపించినా 2015లో ఆయన ప్రాభవానికి బీటలు పడ్డాయని విశ్లేషిస్తున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. వీటిలో కొన్నిచోట్ల మంచి ఫలితాలురాగా మరికొన్ని చోట్ల వికటించింది.

మోడీ రెండేళ్ల పాల‌న పూర్త‌యిన సంద‌ర్భంగా బీజేపీ నేత‌లు ప్ర‌చారం నిర్వ‌హించ‌కుంటుండ‌గా ప్ర‌తిప‌క్షాలు ఈ లెక్క‌లు విడుద‌ల చేశాయి. ప్ర‌ధానిగా మోడీ ప్ర‌జ‌ల‌కు ఏమీ చేయ‌లేద‌ని పేర్కొంటూ క‌నీసం పార్టీకి కూడా మేలు చేయ‌లేద‌ని సెటైర్లు వేశాయి.

రాష్ట్రం ర్యాలీలు పోటీ చేసిన స్థానాలు గెలిచిన సీట్లు

హర్యానా (2014) 11 90 47

జమ్మూ కాశ్మీర్‌ (2014) 4 57 25

జార్ఖండ్‌ (2014) 9 72 37

మహారాష్ట్ర (2014) 27 288 122

ఢిల్లీ (2015) 4 69 03

బీహార్‌ (2015) 31 157 53

అస్సాం (2016) 13 126 86

బెంగాల్‌ (2016) 16 287 06

కేరళ (2016) 6 96 01

తమిళనాడు (2016) 1 164 00