Begin typing your search above and press return to search.

డ్రాగ‌న్ కంట్రీ నోట‌.. చిల‌క‌ప‌లుకులు..!

By:  Tupaki Desk   |   28 Sep 2017 5:11 PM GMT
డ్రాగ‌న్ కంట్రీ నోట‌.. చిల‌క‌ప‌లుకులు..!
X
ఏ ఎండ‌కాగొడుగు ప‌ట్ట‌డం చైనాకు కొత్త‌కాదు. ముఖ్యంగా భార‌త్ విష‌యంలో ప‌రిస్థితుల‌ను బ‌ట్టి స్పందించ‌డం డ్రాగ‌న్ కంట్రీకి మామూలే! భార‌త్ బ‌ల‌హీనంగా ఉంద‌ని భావిస్తే.. ఒక ర‌కంగా, బ‌లంగా ఉంద‌ని భావిస్తే.. ఒక‌రకంగా ప్లేట్ ఫిరాయించ‌డం కామ‌నైపోయింది. తాజాగా సిక్కిం స‌రిహ‌ద్దుల్లోని డొక్లాం వివాదం అంద‌రికీ తెలిసిందే. ముందు త‌ల ఎగ‌రేసి.. ఆ త‌ర్వాత తోక ముడిచిన విష‌యం తెలిసిందే. దీనికి ప్ర‌పంచ దేశాల నుంచి తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఎదురు కావ‌డం అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.

ఇప్పుడు తాజాగా మ‌రోసారి భార‌త్ బ‌లం ఏంటో చైనా తెలుసుకున్న‌ట్టుంది. ముఖ్యంగా అమెరికా-భార‌త్‌ లు ఇటీవ‌ల కాలంలో త‌మ బంధాన్ని పెంచుకోవ‌డం డ్రాగ‌న్ కంట్రీకి చెమ‌టలు ప‌ట్టిస్తున్నాయి. అదుకే భారత్‌ గురించి మాట్లాడేటప్పుడు.. చాలా సంయమనంగా వ్యవహరిస్తోంది. భారత్‌-అమెరికా రక్షణ - ద్వైపాక్షిక సంబంధాల గురించి చైనా గురువారం సానుకూలంగా స్పందించింది. భారత్‌-అమెరికా మధ్య ఏర్పడుతున్న రక్షణ సంబంధాలు.. ఆసియాలో శాంతికి అనుకూలిస్తాయని చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్‌ వూ కియాన్‌ అభిప్రాయపడ్డారు.

భారత్‌-అమెరికాల మధ్య బలపడుతున్న రక్షణ సంబంధాలపై తమ దగ్గర పూర్తి స్థాయిలో సమాచారం ఉందన్నారు. భారత్‌-అమెరికా బంధం బలోపేతం కావడం వల్ల ఆసియాలో శాంతి నెలకొంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎఫ్‌-16 యుద్ధవిమానాలను 'మేకిన్‌ ఇండియా'లో భాగంగా రూపొందించడం, భారత్‌ కు గార్డియన్‌ డ్రోన్ల అమ్మకంపైనా చైనా ఆచితూచి స్పందించింది. హిందూ మహాసముద్రంపై చైనా ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు ఉద్దేశించిన గార్డియన్‌ డ్రోన్ల క్రయవిక్రయాలపైనా డ్రాగన్‌ స్పందిస్తూ.. దీని గురించి పెద్దగా ఆలోచించే పని లేదని పేర్కొంది. కానీ, మొత్తంగా డ్రాగ‌న్ కంట్రీ మ‌న‌సులో బెరుకు క‌నిపించింద‌నే అంటున్నారు.