Begin typing your search above and press return to search.
ఆ చర్చ 2024లో అంటున్న నరేంద్రమోడీ!
By: Tupaki Desk | 30 March 2019 5:26 AM GMTమోడీ కి ప్రత్యర్థి ఎవరు? అనే అంశం గురించి చర్చ ఇప్పుడు కాదు, మరో ఐదేళ్ల తర్వాత, అంటే 2024లో మోడీకి ధీటైన ప్రత్యర్థి ఎవరనే అంశం గురించి చర్చ చేపట్టండి..’ అని అంటున్నారు ప్రధాని మోడీ. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల పరిస్థితి గురించి ఈ విశ్లేషణ చేశారు మోడీ. ప్రస్తుతానికి తనకు ధీటుగా వచ్చే నేత ఎవరూ లేరని, ప్రధాని పీఠం విషయంలో మోడీకి పోటీనే లేదని.. మోడీనే చెబుతున్నారు. అయితే తనే శాశ్వతంగా ప్రధానిగా ఉండటం ఖాయమని మోడీ అనడం లేదు.
తనకు పోటీగా నేతలు వస్తారని, అయితే అది ఇప్పుడు కాదు అని, 2024లో మాత్రమే తనకు ధీటైన నేతల పోటీ ఉంటుందని మోడీ అభిప్రాయపడ్డారు. అప్పుడు మోడీకి ప్రత్యర్థి ఎవరనే అంశం గురించి చర్చ చేపట్టాలని, ఇప్పుడు మాత్నం తనకు తానే సాటి అని, తనతో తనకే పోటీ అని..మోడీ ఎన్నికల ప్రచార సభలో వ్యాఖ్యానించడం విశేషం.
ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ఘన విజయం సాధించడం ఖాయమని మోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. మూడు వందలకు పైగా ఎంపీ సీట్లను తాము గెలుస్తామని మోడీ ధీమాగా చెబుతున్నారు. గత ఎన్నికల్లో తాము సంచలనం నమోదు చేశామని, అలాంటి విజయమే ఇప్పుడు కూడా సాధించడం ఖాయమని మోడీ విశ్వాసంగా చెబుతూ ఉన్నారు.
ఇందులో మరో అంశానికి తావే లేదని, ప్రధాని పీఠం విషయంలో తనకు పోటీనే లేదని మోడీ ధీమాగా చెబుతూ ఉన్నారు. మరో ఐదేళ్లు ఆ పీఠం తనకే అని, ఆ తర్వాతే పోటీదారులు ఎవరైనా ఉంటే రావాలని మోడీ అంటున్నారు. మరి మోడీ ఇంత ధీమాగా చెబుతున్నారు.. ఈ మాటలు నిజమేనా, ఈ విషయంలో ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశం గురించి మే ఇరవై మూడో తేదీన కానీ స్పష్టత రాదు!