Begin typing your search above and press return to search.
ప్రధాని మోడీ వాడే సెల్ ఫోన్ ఏది..?
By: Tupaki Desk | 28 Jun 2016 6:41 AM GMTఇవాల్టి రోజు సెల్ ఫోన్ అన్నది మనిషి జీవితంలో బాగమైంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. శరీరంలో భాగం కాని అవయువంగా మారిందని చెప్పక తప్పదు. సెల్ ఫోన్ లేకుండా నిమిషం కూడా గడవని పరిస్థితి. కటిక పేదవాడి నుంచి ఆగర్భ శ్రీమంతుడి వరకూఅందరికి సెల్ ఫోన్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి. మరింత కీలకమైన ఫోన్ ను ప్రపంచాన్ని ప్రభావితం చేసే అధినేతలు ఎలా వినియోగిస్తారు?
వారు వాడే సెల్ ఫోన్ కంపెనీలు ఏమిటి? అన్న ప్రశ్నే ఆసక్తికరం. మనమంటే ఐఫోనో.. శ్యామ్ సంగ్ లేటెస్ట్ మోడలో.. ఇదేమీ కాకుంటే.. మార్కెట్లోకి వచ్చే ఏదో ఒక కొత్త ఫోన్ ను వాడేస్తుంటాం. మరి.. దేశాధినేతలు వినియోగించే సెల్ ఫోన్లు ఏకంపెనీకి చెందినవన్న విషయాన్ని చూస్తే ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
భారత ప్రధాని మోడీ ఐఫోన్ వినియోగిస్తే.. ప్రపంచానికి పెద్దన్న అయిన ఒబామా వాడేది బ్లాక్ బెర్రీ. ఇక.. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎంటీఎస్ ఫోన్ వాడితే.. బ్రిటన్ ప్రధాని కామెరూన్ బ్లాక్ బెర్రీ ఫోన్ ను వినియోగిస్తారు. ఇక.. జర్మనీ ఛాన్సలర్ మార్కెల్ బ్లాక్ బెర్రీ నే. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ వాడేది బ్లాక్ బెర్రీనే.. ఇక.. ఉత్తరకొరియా అధ్యక్షుడు జంగ్ ఉన్ మాత్రం హెచ్ టీసీ ఫోన్ ను వినియోగిస్తుంటారు. భారత్ లో పెద్దగా ప్రజాదరణ లేని బ్లాక్ బెర్రీ ఫోన్ ను ఇంతమంది దేశాధినేతలు వినియోగించటం విశేషమే కదూ..?