Begin typing your search above and press return to search.
బడ్జెట్ సమావేశాలకు సహకరించాలని విపక్షాలకు మోడీ విజ్ఞప్తి
By: Tupaki Desk | 29 Jan 2021 6:34 AMఢిల్లీలో రైతుల ఆందోళనల నడుమ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడీ స్వయంగా వెనక్కితగ్గి విపక్షాలకు ఓ విజ్ఞప్తి చేయడం విశేషం. పార్లమెంట్ లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాలను మోడీ కోరారు. ఇది సరికాదంటూ ప్రతిపక్షాల వైఖరిని మోడీ తప్పుపట్టారు.
ఇక పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సైతం దీనిపై స్పందించారు. విపక్షాలు పునరాలోచించాలన్నారు. ప్పటివరకు రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎవరూ బహిష్కరించలేదన్నారు. ప్రశ్నలను.. ప్రతిపక్షాలు కేంద్రం ముందుంచాలి కానీ రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించకూడదన్నారు.
కాగా, నూతన సాగు చట్టాల రద్దు కోరుతూ 64 రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బహిష్కరించాలని 18 రాజకీయ పార్టీలు నిర్ణయించిన విషయం తెలిసిందే.
సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, కరోనా వైరస్ సవాళ్లు.. ఇలాంటి సమస్యల నడుమ పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. రెండు విడతలుగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు తొలి విడత, మార్చి 8 నుంచి ఏప్రిల్ 8 వరకు రెండో విడత గా బడ్జెట్ సమావేశాలు సాగనున్నాయి.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు అస్త్రాలను రెడీ చేశాయి. విపక్షాల నుంచి ఎదురయ్యే విమర్శల అస్త్రాలను తిప్పికొట్టేందుకు మోడీ ప్రభుత్వం కూడా వ్యూహాలను రచించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేసిన ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.