Begin typing your search above and press return to search.
ఉద్యోగాలివ్వయ్యా మగడా అంటే కాపలాదారుల్ని చేస్తున్నాడు
By: Tupaki Desk | 18 March 2019 4:53 PM GMTసార్వత్రిక ఎన్నికలు మరెన్నో రోజులు లేకపోవడంతో.. మోడీ - రాహుల్ ఇద్దరూ తమ స్పీడ్ పెంచాడు. రోజుకో సభలో పాల్గొంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాను ఈ దేశానికి కాపలాదారుడ్ని అంటూ మరోసారి సెంటిమెంట్ ప్లే చేస్తున్నారు ప్రధాని మోదీ. చెప్పడమే కాదు.. కాపలాదారు అనేదానికి జస్టిఫై చేస్తూ 3 నిమిషాల వీడియో కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు.. బీజేపీ వాళ్లంతా తమ ట్విట్టర్ - ఫేస్ బుక్ ఎక్కౌంట్స్ ని కూడా చౌకీదారులుగా మార్చుకోవాలని సూచించారు. ఆయన అలా సూచించారు.. అమిత్ షా దగ్గరనుంచి రాజాసింగ్ వరకు అందరూ తమ సోషల్ మీడియా ఎక్కౌంట్స్ ని మార్చేశారు.
ఇక ప్రధాని మోదీ టార్గెట్ లో విమర్శలు కురిపిస్తున్న రాహుల్ గాంధీ చౌకీదార్ కాన్సెప్ట్ పై మరోసారి చెలరేగిపోయారు. దేశం మొత్తాన్ని కాపలదారులుగా ప్రధాని నరేంద్ర మారుస్తున్నారని ధ్వజమెత్తారు రాహుల్ గాందీ. కాపలాదారుడే దొంగగా మారాడు అనే తన వ్యాఖ్యల్ని ఆయన మరోసారి సమర్ధించుకున్నారు. రఫెల్ కుంభకోణం జరిగింది అదేనని ఆరోపణలు చేశారు. ఉత్తర కర్నాటకలోని ఓ బహిరంగ సభలో ప్రసంగించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధానిపై నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్రమోడీ అనిల్ అంబానీ - నీరవ్ మోడీ - మెహుల్ చోక్సీలకు మాత్రమే కాపలాదారుడిగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఎలాగైతే పెద్దనోట్లను మోదీ రద్దు చేశారో... అలానే రాజ్యాంగాన్ని కూడా రద్దు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారని రాహుల్ విమర్శించారు.