Begin typing your search above and press return to search.
ఆ బామ్మను మోడీ ఎందుకు మొక్కారంటే..?
By: Tupaki Desk | 22 Feb 2016 12:44 PM GMTదేశంలోని అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధానమంత్రి ఒక సామాన్య వృద్ధ మహిళ కాళ్లకు మొక్కటం ఏమిటి? అయితే గియితే.. పెద్ద పెద్ద స్వాములోరికి దండాలు పెడతారే కానీ.. వృద్ధ మహిళకు దండం పెట్టే పరిస్థితి ఉంటుందా? అనిపించక మానదు. ప్రధాని కుర్చీలో మోడీ కాకుండా మరెవరు కూర్చున్నా ఇలాంటివి సాధ్యం కాదేమో. కానీ.. మోడీ మిగిలిన వారి మాదిరి కాదు కదా. తన మనసును కదిలించే ఏ విషయాన్ని అయినా ఎలాంటి మొహమాటం లేకుండా వారి కీర్తిని అందరికి తెలిసేలా చాటటం.. వారిని అభినందించే క్రమంలో ఒక సాదాసీదా వ్యక్తిగా వ్యవహరించటం మోడీకి మామూలే.
తాజాగా ఆయన 104 ఏళ్ల వృద్ధ మహిళ కాళ్లకు మొక్కారు. ఇంతకూ ఆయన అలా మొక్కటానికి కారణమైన విషయం వింటే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. తాజాగా ఆయన చత్తీస్ గఢ్ లోని థాంతరి జిల్లా కుర్రుభాత్ లో జరిగిన ఒక కార్యక్రమానికి మోడీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కోటాభర్రి గ్రామానికి చెందిన కున్వర్ భాయి అనే వృద్ధ మహిళను ఆహ్వానించటమే కాదు.. ఆమె కాళ్లకు మొక్కిన మోడీ.. ఆమె గురించి చెప్పుకొచ్చారు. తాను పిలుపునిచ్చిన స్వచ్ఛభారత్ నినాదానికి స్పందనగా తన ఇంట్లో రెండు మరుగుదొడ్లు నిర్మించుకోవటానికి సదరు వృద్ధ మహిళ తన 10 మేకల్ని అమ్ముకున్నారని.. గ్రామంలో మిగిలిన వారు మరుగుదొడ్లు నిర్మించుకోవటానికి ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు. ఇప్పుడా గ్రామంలో అందరి ఇళ్లకు మరుగుదొడ్లు ఉన్నాయని చెప్పిన ఆయన.. స్వచ్ఛభారత్ నినాదం దేశంలోని మారుమూల గ్రామాలకు ఎలా వెళ్లిందో చెప్పటానికి ఈ ఉదంతమే నిదర్శనంగా పేర్కొన్నారు. ఒక వృద్ధ మహిళ కాళ్లకు ప్రధాని మోడీ కాళ్లు మొక్కటం అర్థవంతంగా కనిపించట్లేదు?