Begin typing your search above and press return to search.

మోడీని ప్రశ్నలు అడగాలంటే అతనికి చెప్పాలంట

By:  Tupaki Desk   |   13 Sept 2015 4:50 PM IST
మోడీని ప్రశ్నలు అడగాలంటే అతనికి చెప్పాలంట
X
సోషల్ నెట్ వర్క్ లో రెగ్యులర్ అప్ డేట్స్ చేయటం.. నిత్యం మాట్లాడటం లాంటి సరికొత్త తరహా చర్యలతో చాలామంది భారతీయుల మనసుల్ని దోచుకున్న ప్రధాని మోడీ.. తన ఫేస్ బుక్.. ట్విట్టర్.. సెల్ఫీ లతో విదేశీ ప్రముఖల గుండెల్ని సైతం కొల్లగొట్టిన సంగతి తెలిసిందే.

తాజాగా మోడీకి సంబంధించిన సమాచారాన్ని ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు. తన ఫేస్ బుక్ పేజీలో ఆయన మోడీకి సంబంధించిన పలు అంశాల్ని వెల్లడించారు. మోడీ అమెరికా పర్యటనలో భాగంగా ఫేస్ బుక్ ఆఫీసుకు రానున్నారని.. అందుకోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

సెప్టెంబర్ 27న తమ కార్యాలయానికి మోడీ వస్తున్నారని.. ఈ సందర్భంగా ఆయనతో మాట్లాడుకునే వారు.. ప్రశ్నలు అడగాలని భావించే వారు తనకు నేరుగా వాటిని పంపాలని.. తమ కార్యాలయానికి వచ్చిన మోడీ.. లైవ్ ఛాట్ లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. మరి.. మోడీని సంధిస్తూ ఎలాంటి ప్రశ్నలు వస్తాయో చూడాలి.