Begin typing your search above and press return to search.
జగన్ కి మోడీ వరం : పోలవరానికి భారీగా నిధులు...!
By: Tupaki Desk | 2 Jun 2023 5:46 PM GMTపోలవరం ప్రాజెక్ట్ ని జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేసిన తరువాత హిస్టరీలో ఎన్నడూ రానటువంటి అతి పెద్ద మొత్తాన్ని కేంద్రం ఉదారంగా రిలీజ్ చేయబోతోంది.అడహాక్ నిధుల పేరుతో 17 వేల 144 కోట్ల రూపాయల నిధులను కేంద్రం రిలీజ్ చేసేందుకు అంగీకరించింది.ఇప్పటిదాకా అంటే గత తొమ్మిదేళ్లలో కేంద్రం నుంచి పోలవరానికి వచ్చిన రీ అంబర్స్ మెంట్ మొత్తం దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయలు ఉండొచ్చేమో.
ఇపుడు దాన్ని మించిన సాయం ఏకమొత్తంగా కేంద్రం రిలీజ్ చేయనుంది అంటే నిజంగా పోలవరానికి వరంగానే భావించాలి.ఈ నిధులను విడుదల చేయడానికి కేంద్ర జల వనరుల శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.అదే టైం లో ఈ ప్రాజెక్టుకు నిధుల బదిలీని వేగంగా అందేఆ చూస్తూ రానున్న రోజుల్లో కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ అవసరమైన ఉత్తర్వులను విడుదల చేయనుందని తెలుస్తోంది.
మొత్తానికి చూస్తే చంద్రబాబు అయిదేళ టెర్మ్, జగన్ నాలుగేళ్ళ టెర్మ్ పూర్తి అయ్యాక కేంద్రం ఇంతటి ఉదారత చూపించడం విశేషం.పోలవరం ప్రాజెక్టుకు నిధుల అడ్డంకే ప్రధాన సమస్యగా ఉంటూ వచ్చింది.కేంద్రం సహకరించడంలేదు అని అంతా విమర్శలు కూడా సంధిస్తూ వచ్చారు.
ఇపుడు చూస్తే కేంద్రం తన చిత్తశుద్ధిని చాటుకుంది అని చెప్పవచ్చు.అదే టైం లో ఏపీ ప్రభుత్వం కూడా పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కేంద్రం వైపు చూడాల్సిన వసరం లేదు,వేరే ఎవరినీ నిందించాల్సిన పని అంతకంటే లేదు.ఇపుడు పోలవరం ప్రాజెక్ట్ ని సత్వరమే పూర్తి చేసి నీటిని విడుదల చేయడానికి రాష్ట్రం తన చొరవను కమిట్మెంట్ ని చూపించాల్సి ఉంది.
మరో వైపు చూస్తే ఈ ప్రాజెక్ట్ ఎత్తు తగ్గిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి.దాన్ని గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సహా మంత్రులు కీలక అధికారులు ఖండించారు.ఏ పెద్ద ప్రాజెక్ట్ నిర్మాణం చేయలన్నా దశల వారీగానే చేపడతారు.
పోలవరం విషయంలో భారీ ప్రాజెక్ట్ ఇది.అందువల్ల పునరావాస ప్యాకేజి పెద్ద మొత్తంలో అవుతుంది.ముందుగా ఫేజ్ వన్ అంటూ 41.15 మీటర్ల ఎత్తులో కడతారు.
అక్కడికి ఖాలీ చేసిన పునరావాసాలకు ప్యాకేజి ఇవ్వడంతో తొలి దశలో నీటిని విడుదల చేయడం జరుగుతుంది అని అధికార వర్గాలు చెబుతున్నారు.ఆ తరువాత ఫేజ్ టూ లో 45.72 మీటర్ల ఎత్తుతో పూర్తి చేస్తారు అని అంటున్నారు.అయితే పోలవరం ఎత్తు విషయంలో కేంద్రం తో వైసీపీ రాజీపడి ఈ నిధులను తెస్తోందని ప్రచారం సాగుతోంది. మరి దీనికి కేంద్రం నుంచి కరెక్ట్ గా క్లారిటీ వస్తే బాగుంటుంది.
ఏది ఏమైనా ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఇంత పెద్ద ఎత్తున నిధులు రావడం అంటే ఏపీకి అది శుభ సూచకమే అని చెప్పాలి.పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ఏపీకి అది జీవనాడిగా ఉంటుంది.
అటు గోదావరి డెల్టా,ఇటు కోస్తా జీల్లాలతో పాటు విశాఖకు తాగు పారిశ్రామిక అవసరాలకు నీరు అందించే బృహత్త ప్రాజెక్ట్ గా పోలవరం ఉండబోతోంది.ఏది ఏమైనా కేంద్రం ఈ విషయంలో సానుకూలంగా స్పందించడం మాత్రం ఆనందకరం అని అంటున్నారు.మొత్తానికి జగన్ కి మోడీ ఖుషీ చేసేలా నిధులను మంజూరు చేశారు అంటున్నారు.