Begin typing your search above and press return to search.

మోడీఇంటరాక్షన్ యాక్షన్ లోకి రావాలి..

By:  Tupaki Desk   |   18 Sep 2015 6:02 AM GMT
మోడీఇంటరాక్షన్ యాక్షన్ లోకి రావాలి..
X
ప్రధాని నరేంద్ర మోడీ రిక్షా కార్మికులతో ముచ్చటించనున్నారు. ఆయన తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో రిక్షా డ్రైవర్ లతో మాట్లాడతారు. అదేసమయంలో ఆయన 101 ఇ-రిక్షాలు... 510 సైకిల్ రిక్షాలు పంపిణీ చేయబోతున్నారు. రిక్షా పుల్లర్ లతో ప్రధాని మాటామంతీ కార్యక్రమం అమెరికన్ ఇండియా ఫౌండేషన్(ఏఐఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.

మరోవైపు సొంతంగా రిక్షాలు లేనివారికి తక్కువ వడ్డీ రుణాలతో సొంతంగా రిక్షాలు సమకూర్చేదిశగా ఏఐఎఫ్ ప్రణాళికలు రచిస్తోంది. రిక్షా కార్మికులకు గుర్తింపు కార్డులు, బ్యాంకు ఖాతాలు వంటివి కల్పించనున్నారు.

కాగా మోడీ ప్రధాని అయిన తరువాత ఇప్పటివరకు వివిధ వర్గాలతో భేటీ అవుతున్నా రిక్షా కార్మికులతో భేటీ కావడం ఇదే తొలిసారి. ఆయన ఎన్నికల సమయంలోనే చాయ్ పే చర్చా అంటూ దేశంలోని సామాన్య ప్రజలకు చేరవయ్యారు. అనంతరం ప్రధాని అయిన తరువాత విద్యార్థులు, ఇతర వర్గాలతో నేరుగా - వీడియో కాన్ఫరెన్సులు - గూగుల్ హ్యాంగవుట్ - రేడియో... ఇలా రకరకాల మార్గాల్లో ఇంటరాక్టవుతున్నారు. ఇప్పుడు ఆయన సమాజంలో అట్టడుగువర్గాల ప్రజలనూ కలుసుకుంటున్నారు. అయితే... ప్రధాని మోడీ ఈ మాటామంతీలను మాటలకే పరిమితం చేయకుండా తన ఆలోచనలకు చేతల్లో చూపుతూ దేశ ప్రజలకు మేలు చేయాల్సి ఉంది.