Begin typing your search above and press return to search.
మరో సంచలనానికి సిద్ధమైన మోడీజీ
By: Tupaki Desk | 18 Nov 2016 4:52 AM GMTప్రధాని నరేంద్రమోడీ మరో సంచలనానికి తెరలేపనున్నారని అంటున్నారు. ఇటీవల భారత సరిహద్దులో సర్జికల్ స్ట్రయిక్స్ - తాజాగా పెద్దనోట్ల రద్దుతో తన ప్రత్యేకతను చాటుకున్న మోడీ ఇపుడో అదే రీతిలో తేనె తుట్టె కదపడం వంటి చర్యను తీసుకునేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు. దేశ స్వాతంత్య్ర అనంతరం తరచు చర్చలకే పరిమితమైన క్రీమిలేయర్ విధానానికి పచ్చజెండా ఊపనున్నారనే ఈ వార్త సర్వత్రా చర్చానీయంశంగా మారింది. వివిధ సామాజిక వర్గాల భవితవ్యాన్ని నిర్దేశించి క్రీమిలేయర్ విధానాన్ని ప్రకటిస్తే ఇదొక చారిత్రాత్మకమైన ఘట్టంగా పరిశీలకులు అభివర్ణించే అవకాశం ఉంది.
దేశంలో ఎస్సీ - ఎస్టీ - బీసీలకు రిజర్వేషన్లు రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా సంక్రమించాయి. అయితే రిజర్వేషన్ల ద్వారా లేదా ఇతర అంశాల ప్రాతిపదికన ఆర్ధికాభివృద్ది సాధించిన ఎస్సీ - ఎస్టీ - బీసీలకు చెందిన ఉన్నత వర్గాలు రిజర్వేషన్ల ఫలాలు అందుకుంటున్నాయనీ - ఫలితంగా ఒకే సామాజిక వర్గం లేదా ఒకే కులంలోని పేద కుటుంబం స్థితిగతులు తీసికట్టుగా మారుతున్నాయనీ విమర్శలున్నాయి. ఆర్ధికంగా బలోపేతంగా మారిన అదే సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు మరింత ఉన్నత స్థితికి చేరుకుంటున్నాయనీ, దీంతో సాంఘిక - ఆర్ధిక - అసమానతలకు పొంతన లేకుండా పొయిందనీ - సెక్యూలర్ స్పూర్తితో రూపొందిన రాజ్యాంగం విలువలు అడుగంటి పోతున్నాయని భావించిన ప్రధానమంత్రి తాజాగా రిజర్వేషన్ అనుభవిస్తున్న సామాజిక వర్గాలకు క్రీమిలేయర్ విధానాన్ని అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.కాగా క్రీమిలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు పలుమార్లు యత్నించినప్పటికి రాజకీయ అవంతరాల నేపధ్యంలో వాయిదా పడుతూ వస్తోంది. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నప్పటికి క్రీమిలేయర్ డిమాండ్ పై వెనక్కి తగ్గుతూ వస్తుండడాన్ని ప్రధానమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానాన్ని అమలు చేయాలని సంకల్పించడం ద్వారా మరో సంచలనానికి కేంద్ర బిందువు అయ్యే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇదిలాఉండగా త్వరలో కీలకమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నరేంద్రమోడీ క్రీమిలేయర్ విధానంపై సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటారా - లేదా అనే విషయంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సమాజంలో ఆర్థిక అసమానతలకు లోనైనవారి సంఖ్య ఎక్కువగా ఉండటం వలన ఓటింగ్ విధానాన్ని ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. కొందరికే రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న సామాజిక వర్గాలకు చెక్ పెట్టేందుకు మోడీ తాజాగా క్రీమిలేయర్ విధానంపై దృష్టి సారించినట్లు సమాచారం. రాజకీయంగా లబ్ది చేకూరేందుకు ఈ విషయంలో మోడీ ప్రాధాన్యత ఇస్తారా, లేదా అనే విషయమై తర్జనభర్జన పడుతున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో సంచలనాలకు కేంద్రబిందువుగా మారిన ప్రధాని నరేంద్ర మోడీ క్రీమిలేయర్ విధానంపై విధాన పరమైన నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉందని పరిశీలకుల కథనం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/