Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌కు మోడీ.. మ‌రి కేసీఆర్ ఏం చేస్తారు?

By:  Tupaki Desk   |   2 Feb 2022 11:30 AM GMT
హైద‌రాబాద్‌కు మోడీ.. మ‌రి కేసీఆర్ ఏం చేస్తారు?
X
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ హైద‌రాబాద్‌కు వ‌స్తున్నారు. త్రిదండి చిన‌జీయ‌ర్ స్వామి ఆధ్వ‌ర్యంలో ముచ్చింత‌ల్‌లో ఏర్పాటు చేసిన స‌మాతా మూర్తి రామానుజుల వారి దివ్య విగ్ర‌హావిష్క‌ర‌ణ నిమిత్తం.. మోడీ హైద‌రాబాద్ వ‌స్తున్నారు. ఇది రాజ‌కీయ ప‌ర్య‌ట‌న కాక‌పోయినా... ప్రాధాన్యం సంత‌రించుకుంది. ఎందు కుంటే... ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌టించే కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ కూడా పాల్గొంటున్నారు. ప్రాథ‌మికంగా నిర్ణ‌య‌మైన షెడ్యూల్ ప్ర‌కారం..ప్ర‌ధాన మంత్రి సుమారు గంట‌న్న‌రకు పైగా ఇక్క‌డ ఉంటారు.

వివిధ పూజ‌ల్లోనూ.. విగ్ర‌హావిష్క‌ర‌ణ‌లోనూ ఆయ‌న పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో సీఎం కేసీఆర్ కూడా వ‌స్తుండ‌డంతో ఈ కార్య‌క్ర‌మానికి ప్రాధాన్యం మ‌రింత పెరిగింది. నిన్న‌టికి నిన్న‌.. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన వార్షిక బ‌డ్జెట్‌పై కేసీఆర్ నిప్పులు చెరిగారు. గోల్‌మాల్ గోవిందం అంటూ.. ఊర‌మాస్ కామెంట్లు చేశారు. ఇక‌, రాజ్యాంగాన్నే మార్చాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మోడీ పాల‌న‌పైనా విరుచుకుప‌డ్డారు. ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కాలేవీ .. అంటూ.. నిల‌దీశారు. రాష్ట్రం నుంచి అనేక అంశాల‌పై నివేదిక‌లు పంపామ న్నారు.

అయిన‌ప్ప‌టికీ.. త‌మ‌కు అన్యాయం చేశార‌ని.. ఇది బ‌డ్జెట్ కాద‌ని.. వ్యాఖ్యానించారు. మ‌రి ఇన్ని వ్యాఖ్య‌లు చేసిన కేసీఆర్‌.. క‌ళ్లు తెరిచి చూసే స‌రికి.. అదే ప్ర‌ధాని క‌నుల ముందు ప్ర‌త్య‌క్షం అవుతున్నారు.. మ‌రి ఈ వేడిలో ఆయ‌న మోడీని దులిపేస్తారా? బ‌డ్జెట్ పై త‌న అభిప్రాయాల‌ను మీడియా ముందు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్టుగా.. మోడీ ముందు కూడా వెల్ల‌డిస్తారా? అనేది ఆస‌క్తిగా మారింది.

ఎందుకంటే... ప్ర‌ధాని రాగానే ఓ 10 నిముషాలు... విశ్రాంతికి కేటాయించారు. ఈ సమ‌యంలో సీఎం కోరితే అప్పాయింట్మెంట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఏం చేస్తారు? ఏవిధంగా త‌న‌ అక్క‌సును తీర్చుకుంటారు? అనేది ఆస‌క్తిగా మారింది.