Begin typing your search above and press return to search.

మోడీ త‌ర్వాతి టార్గెట్ వారి మీద‌నేన‌ట‌!

By:  Tupaki Desk   |   31 July 2017 9:48 AM GMT
మోడీ త‌ర్వాతి టార్గెట్ వారి మీద‌నేన‌ట‌!
X
సార్వ‌త్రిక ఎన్నిక‌లకు సంబంధించి ప్ర‌చారం జోరుగా సాగుతున్న స‌మ‌యంలో ఒక ఆస‌క్తిక‌ర చ‌ర్చ కొంద‌రి మ‌ధ్య న‌డిచింది. అదేమంటే.. త‌న మాట‌ల‌తో ఎలాంటి వారినైనా ఫిదా చేసే బీజేపీ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థి మోడీ.. ఒక‌వేళ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ప్ర‌ధాని పీఠం మీద కూర్చుంటే.. ఢిల్లీలో ఆయ‌న అధికారుల‌పై ఎంత కాలంలో ప‌ట్టు సాధిస్తార‌న్న ప్ర‌శ్నపై భారీగానే చ‌ర్చ సాగింది.

ఎందుకంటే ఢిల్లీలో అధికారుల లాబీ చాలా ప‌వ‌ర్ ఫుల్‌. అందులోకి ప‌దేళ్లు యూపీఏ స‌ర్కారుకు అల‌వాటు ప‌డిన అధికార గ‌ణాన్ని త‌న దారికి తీసుకురావ‌టానికి మోడీకి కొంత‌కాలం ప‌డుతుందంటూ చాలానే ఊహాగానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. అయితే.. అలా సాగిన అంచ‌నాల‌న్నీ త‌ప్ప‌న్న‌ట్లుగా చేత‌ల్లో త‌న స‌త్తా ఏమిటో చూపించారు ప్ర‌ధాని మోడీ.

తన చేతికి ప‌వ‌ర్ వ‌చ్చిన వెంట‌నే.. ఢిల్లీలోని ముదురు అధికారుల‌కు షాకుల మీద షాకులు ఇచ్చిన మోడీ.. అంద‌రూ ప్ర‌ధానులు ఒక‌లా ఉండ‌ర‌ని.. మోడీ మిగిలిన వారికి చాలా డిఫ‌రెంట్ అన్న విష‌యాన్ని అర్థ‌మ‌య్యేలా చేశారు. ఇలా త‌న మార్క్ పాల‌న‌తో సాగుతున్న మోడీ ఇప్ప‌టికే ప‌లు మార్లు త‌న నిర్ణ‌యాల‌తో దేశ ప్ర‌జ‌ల‌కు సైతం భారీ షాకులే ఇచ్చారు. మ‌రి.. ఇప్పుడు ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేస్తున్నార‌న్న ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఒక‌టి గ‌డిచిన కొంత‌కాలంగా వినిపిస్తోంది.

తాజా స‌మాచారాన్ని చూస్తే.. మోడీ నెక్ట్స్ టార్గెట్ ఎవ‌ర‌న్న విష‌యంపై క్లారిటీ వ‌చ్చేసింద‌ని చెప్పాలి. త‌న‌దైన ప్ర‌యారిటీల‌తో వెళుతున్న మోడీ స‌ర్కారు.. తాజాగా అవినీతికి పాల్ప‌డుతున్న అధికారుల జాబితాను త‌యారు చేయాల్సిందిగా హోం మంత్రి కార్యాల‌యం నుంచి అన్ని మంత్రిత్వ శాఖ‌ల‌కు లేఖ‌లు వెళ్ల‌టం ఇప్పుడు పెను సంచ‌ల‌నంగా మారింది.

ఈ లిస్ట్ లో ఉన్న అధికారుల‌పై ఆగ‌స్టు15 త‌ర్వాత చ‌ర్య‌లు షురూ కానున్న‌ట్లుగా చెబుతున్నారు. అవినీతి అన‌కొండ‌ల లిస్ట్ త‌యారు చేయాలంటూ వ‌చ్చిన లేఖ‌లు అధికారుల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ఇదిలా ఉంటే.. అధికారుల స‌ర్వీసు లిస్ట్ ఆధారంగా జాబితాల‌ను సిద్ధం చేస్తున్నార‌ట‌. అక్ర‌మాల‌కు పాల్ప‌డే అధికారుల్ని చ‌ట్టం ముందు నిల‌బెట్ట‌ట‌మే మోడీ త‌ర్వాతి ప్లాన్ గా చెబుతున్నారు. ఒక‌వేళ‌.. ఇప్పుడు అనుకున్న‌దే జ‌రిగితే దేశ‌వ్యాప్తంగా అదో సంచ‌ల‌నంగా మారుతుంద‌న‌టంలో సందేహం లేదంతే.