Begin typing your search above and press return to search.
టార్గెట్ రూ.లక్ష కోట్లు.. మహా బాదుడుకు మోడీ మాష్టారు
By: Tupaki Desk | 12 Dec 2019 5:43 AMకొడితే అలా ఇలా కాదు.. దిమ్మ తిరిగిపోవాలన్నట్లుగా సినిమాల్లో చెప్పే మాటలు విన్నంతనే చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. కానీ.. అలాంటి సందర్భమే ఎదురైతే సామాన్యుడి పరిస్థితి ఏమిటి? మోడీ మాష్టారి అత్యుద్భత పాలనలో పన్ను బాదుళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. పన్నుల పెంపు విషయంలో ఏ మాత్రం మొహమాటం లేకుండా వ్యవహరించే తీరు ఒక ఎత్తు అయితే.. ఇది చాలదన్నట్లుగా అంతకంతకూ పన్ను వసూళ్లను మరింత పెంచేందుకు వీలుగా తీసుకొస్తున్న కొత్త విధానాల లెక్క వింటే వణుకు పుట్టాల్సిందే.
మండిస్తున్న ఆర్థిక మాంద్యం దెబ్బకు ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. ఈ లోటును భర్తీ చేసుకునేందుకు కసరత్తు చేసిన కేంద్రం.. చివరకు ఆ భారాన్ని ప్రజలకు బదిలీ చేయాలని డిసైడ్ చేసింది. ఇందులో భాగంగా భారీ ప్లాన్ వేసింది. ఏడాదికి తక్కువలో తక్కువ రూ.లక్ష కోట్ల వరకూ అదనపు బాదుడుకు రంగం సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. మాంద్యం ప్రభావంతో ప్రభుత్వానికి వచ్చే పన్ను వసూళ్ల ఆదాయం తగ్గింది. దీంతో.. తగ్గిన ఆదాయాన్ని సమకూర్చుకోవటానికి.. అదనంగా మరింత భారాన్ని ప్రజల మీద మోపేందుకు ప్లాన్ సిద్ధం చేశారు.
ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో జీఎస్టీ వాటా పెద్దదే. ఇప్పటికి అమల్లో ఉన్న నాలుగు శ్లాబుల స్థానే ఇకపై మూడు శ్లాబులకు కుదించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం అమలవుతున్న పన్ను శ్లాబుల్ని చూస్తే వివిధ వస్తు సేవలపై 5.. 12.. 18.. 28 శాతాలుగా జీఎస్టీ రేట్లు అమలవుతున్నాయి. విలాసవంతమైన.. ప్రమాదకర వస్తువుల పైనా.. సేవల పైనా ఇప్పుడున్న పన్ను రేట్లకు అదనంగా ఒకటి నుంచి పాతిక శాతం వరకూ సెస్ రూపంలో బాదేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని పెంచేందుకు ఇప్పటికే నాలుగు శ్లాబుల్ని మూడింటికి కుదించాలన్నది తాజా ప్లాన్ గా చెబుతున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఐదు శాతం పన్ను శ్లాబును ఎత్తేసి.. దాని స్థానే 8 శాతం శ్లాబును తెర మీదకు తీసుకురానున్నారు. అదే సమయంలో 12 శాతం ఉన్న శ్లాబును 15 శాతానికి మార్చనున్నారు. ఇక.. 18శాతం శ్లాబును ఎత్తేస్తున్నారు.
అంతేకాదు.. ఇప్పుడు జీఎస్టీ నుంచి మినహాయింపు పొందుతున్న వస్తువుల్ని.. సేవల్ని కొన్నింటిని పన్నుల పరిధిలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెబుతున్నారు. జీఎస్టీ శ్లాబు రేట్లను పెంచటంతో నిత్యవసర వస్తువులతో పాటు.. పలు వస్తువుల ధరలు.. సేవల ఛార్జీలు పెరగటం ఖాయం. ఈ పెంపు నుంచి ప్రభుత్వం తక్కువలో తక్కువ రూ.లక్ష కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్నది లక్ష్యమంటున్నారు. ఈ భారీ మొత్తం దేశ ప్రజల జేబుల్లో నుంచి కాస్త కాస్తగా వెళ్లి ఖజాలోకి చేరనుంది. మోడీ అద్భుతమైన పాలనతో ఈ భారీ బాదుళ్లేందన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతున్నారు.