Begin typing your search above and press return to search.
క్రీడారంగ ప్రముఖులతో ప్రధాని మోదీ సమావేశం ..దేనికోసమంటే !
By: Tupaki Desk | 3 April 2020 9:30 AM GMTదేశంలో రోజు రోజుకు కరోనా తీవ్రత పెరిగిపోతున్న తరుణంలో ప్రధాని మోడీ వరసగా ప్రముఖులతో వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. తాజాగా క్రీడా రంగానికి చెందిన 40 మంది ప్రముఖులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు, ఈ మహమ్మారిని అరికట్టేందుకు క్రీడాకారుల నుంచి కావాల్సిన సహకారంపై ఆయన ప్రధానంగా చర్చించారు. కరోనాకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ విధించిన తర్వాత క్రీడాకారులతో ప్రధాని మాట్లాడడం ఇదే తొలిసారి.
ఈ కార్యక్రమంలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, మహిళా బాక్సర్ మేరీ కోమ్, పీటీ ఉష, పుల్లెల గోపీచంద్, విశ్వనాథన్ ఆనంద్, హిమదాస్, బజ్రంగ్ పూనియా, పీవీ సింధు, రోహిత్ శర్మ, వీరేంద్ర సెహవాగ్, యువరాజ్ సింగ్, ఛటేశ్వర పూజారా తదితరులు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కాగా, ఈరోజు ఉదయం 9 గంటలకు వీడియో సందేశం ఇచ్చిన మోడీ, ఇప్పుడు దేశంలోని ప్రముఖ క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇకపోతే క్రీడారంగంలో అద్భుత ప్రదర్శన కనబర్చుతూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతున్న భారత క్రీడాకారులపై ప్రధాని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం కరోనా మహమ్మారిపై జరుగుతున్న యుద్ధంలో కూడా క్రీడాకారులు కీలక పాత్ర పోషించాలని , ప్రజలకు సామాజిక దూరం పై అవగాహన కల్పించడంతో పాటు, లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మోదీ నాయకత్వాన్ని క్రీడాకారులు ఈ సందర్భంగా ప్రశసించారు. నిస్వార్థంగా పని చేస్తోన్న వైద్య సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.