Begin typing your search above and press return to search.

2022 ఎన్నికలు - ఆపై మోడీ రిటైర్మెంట్?

By:  Tupaki Desk   |   10 Sep 2019 2:30 PM GMT
2022 ఎన్నికలు - ఆపై మోడీ రిటైర్మెంట్?
X
దేశంలో ఒకే సారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనను భారతీయ జనతా పార్టీ వాళ్లు ఇది వరకే చేశారు. గత టర్మ్ లోనే వారు ఎన్నికల కమిషన్ ముందు ఈ ప్రతిపాదనను పెట్టి.. ఈ విషయంలో వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు. అయితే కాంగ్రెస్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇక ఇతర పార్టీలు కూడా మోడీ నిర్ణయం పట్ల అంత సానుకూలంగా స్పందించలేదు.

అయితే అప్పుడు మోడీకి ఇంత పవర్ లేదు. వరసగా రెండోసారి ప్రధాని అయ్యాకా ఆయనకు సహజంగానే శక్తి మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఒకదేశం - ఒకే ఎన్నిక అనే సూత్రాన్ని అమలు పెట్టాలని మోడీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే అదంతా సాధ్యమయ్యే ప్రక్రియేనా? అనేది మాత్రం ఇంకా ఎవరికీ స్పష్టత లేదని అంశం.

దాని కోసం చాలా కసరత్తే చేయాల్సి ఉంటుంది. అంతలోనే వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవైపు ఎన్నికలు నిర్వహించుకుంటూ పోతూ ఉంటే - మరోవైపు ఒక దేశం - ఒకే ఎన్నికలు అనడం కేవలం నినాదంగా మారే అవకాశం ఉంది. ఈ ఏడాదే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రతియేడాదీ కొన్నింటికి ఎన్నికలు తప్పవు. వాటి విషయంలో ఎలా డీల్ చేస్తారనేది.. ఒకేసారి దేశమంతా ఎన్నికలను నిర్వహించడం మీద ఆధారపడి ఉంటుంది.

ఇక డెబ్బై ఐదేళ్ల వయసులో రాజకీయాల నుంచి రిటైర్మెంట్ అనే నియమాన్ని కూడా మోడీ అమలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్లను ఆకారణం చూపి పక్కన పెట్టారు. ఇలాంటి నేపథ్యంలో మోడీ కూడా ఆ నియమాన్ని పాటిస్తారని.. 2025 కు తనకు డెబ్బై ఐదేళ్ల వయసు మీద పడగానే.. ఆయన రాజకీయం నుంచి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని తప్పుకుంటారని కూడా బీజేపీ వర్గాలు అంటున్నాయట. మరి ఈ ప్రతిపాదనలు ఏ మేరకు అమల్లోకి వస్తాయో!