Begin typing your search above and press return to search.

దీపావళి పూట మోడీ సర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   27 Oct 2019 5:30 PM GMT
దీపావళి పూట మోడీ సర్ ప్రైజ్
X
ప్రధాని నరేంద్రమోడీ ఎవ్వరూ ఊహించని విధంగా దీపావళి వేడుకను జరుపుకున్నారు. దేశ సరిహద్దుల్లో కాపాలా కాస్తున్న సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. జమ్మూకాశ్మీర్ లోని నియంత్రణ రేఖ (ఎల్ ఓసీ )లో కాపలా కాస్తున్న సైనికుల వద్దకు వెళ్లి అక్కడ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాజౌరి జిల్లాకు చేరుకున్న మోడీ అక్కడి నుంచి నియంత్రణ రేఖ వద్దకు వెళ్లి సైనికులతో ఉల్లాసంగా గడిపారు.

జమ్మూకశ్మీర్ పై పాకిస్తాన్ 1947లో ఎక్కడైతే దాడి చేసి ఆక్రమించిందో. అక్కడికి వెళ్లి భారత బలగాలు మొట్టమొదట కశ్మీర్ ను పాకిస్తాన్ నుంచి విడిపించిన చోటుకు మోడీ వెళ్లాడు. ఆ ప్రాంతంలోనే దీపావళి వేడుకలను చేసుకున్నారు. భారత దళాలతో కలిసి నేరుగా ముచ్చటించి సైనికులకు స్వీట్లు తినిపించారు.

కశ్మీర్ ను విభజించి ఆర్టికల్ 370 రద్దు చేశాక తొలిసారి మోడీ కశ్మీర్ లో పండుగ నాడు పర్యటించి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. మోడీని చూసి సైనికులు సంభ్రమాశ్చార్యాలకు గురయ్యారు. 2014 నుంచి సరిహద్దు ప్రాంతంలో దళాలతో కలిసి మోడీ దీపావలి జరుపుకోవడం ఇది మూడోసారి.