Begin typing your search above and press return to search.

బీఎస్ ఎన్ ఎల్‌.. ఇక మాయం.. మోడీ వ్యూహం ఇదే!

By:  Tupaki Desk   |   28 Feb 2023 5:00 AM GMT
బీఎస్ ఎన్ ఎల్‌.. ఇక మాయం.. మోడీ వ్యూహం ఇదే!
X
ప్ర‌ధాని మోడీ త‌ర‌చుగా ఒక మాట చెబుతూ ఉంటారు. గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరుతోనే ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు అన్నీ కూడా మ‌టుమాయం అవుతున్నాయ‌ని..వాటిని నిరర్థ‌కంగా మార్చేశార‌ని.. ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పిస్తుంటారు. అందుకే విధిలేని ప‌రిస్థితిలో తాము వాటిని ఏమీ చేయ‌లేక పోతున్నా మ‌ని కూడా చెబుతుంటారు. మ‌రి మోడీ స‌ర్ ఏం చేస్తున్నారు? ఆయ‌న హ‌యాంలో ఎలా వ్య‌వ‌హ‌రిస్తున్నా రు? అనేది ఆస‌క్తిగా మారింది.

ఉన్న‌వాటిని అమ్ముతున్నారు! అనే మాట కామ‌న్‌గానే వినిపిస్తోంది. అయితే.. ఉన్న‌వాటిని అమ్మ‌డ‌మే కాదు.. ఉన్న ప్ర‌భుత్వ రంగ కంపెనీల‌ను మ‌రింత అతఃపాతాళానికి తొక్కేస్తున్నార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఒక‌ప్పుడు జోరుమీదున్న భార‌త టెలికం కంపెనీ.. బీఎస్ఎన్ఎల్‌గా విడ‌గొట్టి.. ప్రైవేటుకు అనేక అధికారాలు ఇచ్చారు. ఫ‌లితంగా.. ప్రైవేటు టెలికం రంగం పుంజుకుంది.

ఇక‌, ఇప్పుడు అస‌లు బీఎస్ ఎన్ ఎల్‌నే లేకుండా చేసే వ్యూహం ఏదో ముందుకు సాగుతోంద‌ని అంటున్నా రు ప‌రిశీల‌కులు. ఎలాగంటే.. కేంద్రంలోనీ బీజేపీ ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్‌కు ఇప్పటిదాకా 4G లైసెన్స్‌నే ఇవ్వ‌లేద‌ట‌.

నెట్‌వర్క్ విస్తరణ చేపట్టలేదు. ఇప్పటిదాకా 4G నే ఇవ్వని వారు 5G ఎప్పుడు ఇస్తారనేది ప్ర‌శ్న‌. అయితే.. అదేస‌మ‌యంలో ఇత‌ర ప్రైవేటు నెట్‌వ‌ర్క్‌ను మాత్రం కేంద్రం ప్రోత్స‌హిస్తోంది.

రిల‌య‌న్స్‌కు 5జీ అప్ప‌గించేశారు. ఇక‌, బీఎస్ ఎన్ ఎల్‌ మొబైల్ రంగంలోకి రాక ముందు ఇన్‌క‌మింగ్ కాల్‌ కి కూడా డబ్బులు పడేవి. బీఎస్ ఎన్ ఎల్‌ ప్రవేశంతో దానికి చెక్ పడింది.కానీ, ఇప్పుడు బీఎస్ ఎన్ ఎల్‌కు మాత్రం 5జీ అనుమ‌తులు ఇవ్వ‌లేదు.

ఎయిర్ టెల్‌కు కూడా ఇస్తున్నారు. ఇలా చేసే క‌దా.. అప్ప‌ట్లో ప్ర‌భుత్వ రంగాన్ని నాశ‌నం చేసింద‌ని చెబుతున్న‌మోడీ.. ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ ఎంత నష్టాల్లోకి పోతే అంత త్వరగా అమ్మేయవచ్చు అనే మంత్రం ప‌ఠిస్తున్నారా? అనేది ప్ర‌శ్న‌.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.